»   » టైటిల్ మార్చి వదులుతున్న గుణ్ణం గంగరాజు

టైటిల్ మార్చి వదులుతున్న గుణ్ణం గంగరాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జస్ట్ ఎల్లో మీడియా ఫ్రై.లిమిటెడ్ పతాకంపై గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో ఊర్మిళ గుణ్ణం నిర్మించిన వెరైటీ ఎంటర్ టైనర్ 'చందమామ లో అమృతం'. శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం టైటిల్ మార్చారు ఆయన. ఇంతకీ మార్చిన టైటిల్ ఏమిటంటే...' అమృతం...చందమామ లో'. ఇలా టైటిల్ మార్చడం ఎందకనేది తెలియదు కానీ...మార్చడం వల్ల ఏం కలిసివస్తుందనేదో చూడాలి. ఏమన్నా న్యూమరాలజిస్టు సలహాపై ఈ టైటిల్ ని మార్చారా అన్నది కూడా చర్చగా మారింది.

దర్శకులు గంగరాజు గుణ్ణం మాట్లాడుతూ - ''నేను అమృతం సీరియల్ ఆరంభించినప్పుడు రాఘవేంద్రరావుగారిని పిలిచాను. ఆయన నీకేమైనా మతి పోయిందా... ఈ రోజు అమావస్య అన్నారు. అమావస్య రోజున ఆరంభించాం. ఎందుకు ఆరంభించామనే విషయం ఈ చందమామ సినిమా చూస్తే అర్ధమవుతుంది'' అన్నారు.

Logo of the new title of the film Amrutham ChandamamaLo

నాగ్ మాట్లాడుతూ - ''అప్పుడప్పుడు యుట్యూబ్లో అమృతం సీరియల్ ఎపిసోడ్స్ చూస్తుంటాను. 313 ఎపిసోడ్స్ అనుకుంటాను. అత్త, కోడళ్ల అనుబంధాలతో సీరియల్స్ చేయడం ఈజీ. కానీ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ, ఇన్ని ఎపిసోడ్స్ తో సీరియల్ చేయడం అంత ఈజీ కాదు. ఈ సీరియల్ వల్ల 'మా' టివి టిఆర్పీ రేటింగ్ పెరిగింది. ఇందుకు గంగరాజుగారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం షూటింగ్ ని ఇప్పుడు ఆడియో వేడుక జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలోని ఈ సెట్ లో రెండు నెలలు షూటింగ్ చేసారు. దాంతో ఈ ఫ్లోర్ కి అమృతం అని పేరు పెడదామని మాట్లాడుకున్నాం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్'' అని తెలిపారు.

అవసరాల శ్రీనివాస్, హరీష్, శివనారాయణ, వాసు ఇంటూరి, ధన్య బాలకృష్ణ, సుచిత్ర, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, కృష్ణ భగవాన్, చంద్రమోహన్, ఎల్బీ శ్రీరాం తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా - రసూల్ ఎల్లోర్, సంగీతం - శ్రీ, లిరిక్స్ - అనంత శ్రీరామ్, ఎడిటింగ్ - ధర్మేంద్ర, డ్యాన్స్ - విజయ్, గ్రాపిక్స్ - ఈ సి యస్, లాఫింగ్ డాట్స్, సహ నిర్మాత - సందీప్ గుణ్ణం, నిర్మాత - ఊర్మిళ గుణ్ణం, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - గంగరాజు గుణ్ణం.

English summary

 Gunnam Ganga Raju Changed his film title to AmruthamChandamamaLo from Chandamama lo Amrutham. The film is expected to be a laugh riot and Gunnam Gangaraju is extremely confident about the output.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu