»   »  ప్రియుడితో కలిసి అనుష్క, వెంట తండ్రి కూడా (ఫోటోస్)

ప్రియుడితో కలిసి అనుష్క, వెంట తండ్రి కూడా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ ఎఫైర్లలో హీరోయిన్ అనుష్క శర్మ వ్యవహారం యమ హాట్. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లితో అమ్ముడు గత కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఇద్దరూ కలిసి శుక్రవారం ముంబైలో ఓ స్టార్ హోటల్ కి లంచ్ డేట్ కి వచ్చి ఫోటోలకు చిక్కారు. ఈ సారి వీరి వెంట అనుష్క ఫాదర్, కల్నల్ అజయ్ కుమార్ శర్మ కూడా ఉండటం గమనార్హం.

టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి గురువారం సౌతాఫ్రికా జరిగిన మ్యాచ్ లో సెంచరీ స్కోర్ చేసాడు. ఈ ఆనందపు క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి విరాట్ కోహ్లి తన లేడీ లవ్ తో కలిసి ఇలా లంచ్ డేట్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. సెలబ్రేషన్స్ లో అనుష్క తండ్రి కూడా పాల్గొనడం హాట్ టాపిక్ అయింది.

మరో విషయం ఏమిటంటే...ఈ ముగ్గురు(విరాట్, అనుష్క, అజయ్) ఈ హోటల్ లో కలవడం వెనక ఓ డీల్ కూడా ఉందని, అనుష్క-విరాట్ కలసి ముంబైలో ఓ ప్రాపర్టీ కొనడానికి ప్లాన్ చేసారని, హోటల్ లో అందుకు సంబంధించిన డీల్ వ్యవహారం కూడా పూర్తయినట్లు టాక్.

అటు విరాట్ కోహ్లి, ఇటు అనుష్క శర్మ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరినీ ఇలా చూసిన ఫ్యాన్స్ తగిన జోడీ అంటూ ప్రశంసించేస్తున్నారు. అనుష్క సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం కరణ్ జోహార్ మల్టీస్టారర్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో నటిస్తోంది.

విరాట్-అనుష్క

విరాట్-అనుష్క


అనుష్క, విరాట్ కలిసి ముంబైలోని ఓ హోటల్ లో లంచ్ డేట్ కు వచ్చిన దృశ్యం.

డాషింగ్ లుక్

డాషింగ్ లుక్


బ్లాక్ టీ షర్టు, బ్లూ జీన్స్, స్టైలిష్ గ్లాసెస్ ధరించి విరాట్ కోహ్లి స్టైలిష్ గా కనిపించాడు.

అనుష్క శర్మ

అనుష్క శర్మ


అనుష్క వర్మ ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా చిరిగిన జీన్స్, వైట్ టాప్ తో ఆకట్టుకుంది.

చైనీస్ రెస్టరెంట్

చైనీస్ రెస్టరెంట్


ముంబైలో శుక్రవారం ఓ చైనీస్ రెస్టరెంటు వద్ద ఈ జంట కనిపించింది.

ప్రాపర్టీ డీల్

ప్రాపర్టీ డీల్


వీరితో పాటు అనుష్క ఫాదర్ అజయ్ కుమార్ శర్మ కూడా ఉండటంతో... వీరి మీటింగ్ వెనక ప్రాపర్టీ డీల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బ్యాక్ సీట్లో..

బ్యాక్ సీట్లో..


అజయ్ కుమార్ శర్మ కారు ముందు సీట్లో ఉండగా.... అనుష్క, విరాట్ మాత్రం వెనక సీట్లో కూర్చున్నారు.

సెలబ్రేటింగ్ మూడ్

సెలబ్రేటింగ్ మూడ్


టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి గురువారం సౌతాఫ్రికా జరిగిన మ్యాచ్ లో సెంచరీ స్కోర్ చేసాడు. ఈ ఆనందపు క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి విరాట్ కోహ్లి తన లేడీ లవ్ తో కలిసి ఇలా లంచ్ డేట్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

అనుష్క

అనుష్క


అనుష్క సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం కరణ్ జోహార్ మల్టీస్టారర్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్' చిత్రాలో అనుష్క నటిస్తోంది.

ప్రేమ జంట

ప్రేమ జంట


ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హాట్ టాపిక్

హాట్ టాపిక్


విరాట్, అనుష్క, అజయ్ కుమార్ శర్మ కలిసి రావడం హాట్ టాపిక్ అయింది.

English summary
One of the most popular love-birds of Bollywood, Anushka Sharma and Virat Kohli, who are allegedly dating each other, spotted together on a lunch date along with Anushka's father, Colonel Ajay Kumar Sharma at a Chinese restaurant in Mumbai on Friday (October 23, 2015).
Please Wait while comments are loading...