Don't Miss!
- News
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Love Story on Aha : స్ట్రీమింగ్ డేట్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య.. సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా అందుకు తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు దసరా సెలవుల్లో కూడా బాగానే వచ్చాయి. ఒక విధంగా కొత్త సినిమాలకు పోటీపడుతూ ఒక్కసారిగా నెంబర్ ను పెంచుకుని షాకిచ్చింది. దసరా సెలవులు సినిమాకి కలిసి రాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

శేఖర్ కమ్ముల దెబ్బతో
అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల మీద లవ్ స్టోరీ సినిమాను కే నారాయణదాసు నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సిహెచ్ దీనికి సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఒక సున్నితమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'లవ్ స్టోరీ' సినిమాకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి, అంచనాలకు అనుగుణంగానే సినిమా నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది.

మూడు సినిమాలకు ధీటుగా
'లవ్ స్టోరీ' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. దసరాకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సిద్దార్థ్ శర్వానంద్ కలిసి నటించిన మహా సముద్రం సినిమా గురువారం,శనివారం రోజు అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందడి విడుదలయ్యాయి.

దసరా నాడు కూడా హౌస్ ఫుల్ బోర్డులు
ఈ క్రమంలో లవ్ స్టోరీ సినిమా ప్రభావం ఉందని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఊహించని విధంగా పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అలా 22 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్ చూస్తే నైజాంలో 12.47 కోట్లు, సీడెడ్‌లో 4.41 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.70 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.45 కోట్లు, గుంటూరులో 1.57 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.48 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ 92 లక్షలు వసూలు చేసింది. లవ్ స్టొరీ సినిమా ఏపీ, తెలంగాణలో 22 రోజులకు గాను 27.08 కోట్ల షేర్ అందుకుని 44.15 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
|
ప్రాఫిట్ జోన్ లోకి
ఇక ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.20 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటివరకు 34.13 కోట్ల షేర్ దక్కింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి ప్రస్తుతం 2.13 కోట్ల ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా డిజిటల్ వేదికగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కొంత మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల కోసం కూడా విడుదల కావడానికి సిద్ధమైనట్లు ఆహా ప్రకటించింది. ఈ సినిమా అక్టోబర్ 22వ తేదీన డిజిటల్ ప్రేక్షకుల కోసం ఆహా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Recommended Video

అక్టోబర్ 22న
''అవును అవును అవును! ది మ్యాజికల్ సూపర్ హిట్ #Love Story ప్రీమియర్ అక్టోబర్ 22న సాయంత్రం ఆరు గంటలకు ఆహా వీడియోలో మాత్రమే చూడండి, అని చెబుతూ ఇదిగో ఆహా కట్ ట్రైలర్ అని చెబుతూ మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సంస్థ సొంతం చేసుకుంది. త్వరలోనే టీవీలో కూడా వచ్చే అవకాశం ఉంది.