»   » పెళ్లయ్యాక ఎంత మార్పు!! :భర్త తో కలిసి హీరోయిన్ అసిన్ ఓ పెళ్లిలో (ఫొటోలు)

పెళ్లయ్యాక ఎంత మార్పు!! :భర్త తో కలిసి హీరోయిన్ అసిన్ ఓ పెళ్లిలో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తెలుగులో వరస పెట్టి సినిమాలు చేసి ఆ తర్వాత తమిళం, హిందీ భాషలకు వెళ్లిన అసిన్ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు బై చెప్పేసింది. అసిన్, మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మల వివాహం ఇటీవలి కాలంలో టాకాఫ్ ది ఇండస్ట్రీ అయింది. వారి ప్రేమ కథ ఓ ఫెయిరీ టేల్ లాగ జనం మాట్లాడుకున్నారు.

వీరి ప్రేమ వివాహం క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం కొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. వివాహానంతరం వీరిద్దరూ సంప్రదాయ మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి ఓ మ్యారేజ్ కు హాజరయ్యారు. అక్కడ ఫొటోలు మీకు అందిస్తున్నాం.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.... రాహుల్-అసిన్ ప్రేమ వ్యవహారం వెనక మన్మధుడి పాత్ర పోషించిన వ్యక్తి అక్షయ్ కుమార్. అసలు అక్షయ్ కుమార్ లేకుంటే ఈ ఇద్దరూ ఒక్కటయ్యే వారే కాదు. రాహుల్ శర్మ అక్షయ్ కుమార్ ఫ్రెండ్ కావడం, అక్షయ్ సినిమాలో అసిన్ నటించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది.

 చూడముచ్చటగా..

చూడముచ్చటగా..

అసిన్, రాహుల్ ఇద్దరూ ఈ వెడ్డింగ్ లో మెరిసిపోయారు. అబు జానీ సందీప్ కోశ్లా అవుట్ ఫిట్ లో అసిన్ కనిపించి అలరించింది. ఆమె డైమండ్స్ రింగ్స్తో మెరిసిపోతూండగా, ఆమె భర్త మాత్రం నల్లటి ఎటైర్ లో అదరకొట్టాడు. జంట చూడముచ్చటగా ఉంది కదూ.

 గుట్టు విప్పలేదు

గుట్టు విప్పలేదు

తనకు మంచి పేరు తెచ్చిన గజినీ సినిమాలో సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ ని ప్రేమించినట్లే నిజజీవితంలో కూడా సెల్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ ఓనర్ రాహుల్ శర్మను ఈ మధ్యనే ప్రేమించి పెళ్ళిచేసుకొంది. అయితే ఇప్పటివరకు వారి మధ్య జరిగిన లవ్ స్టొరీ గురించి అసిన్ గుట్టువిప్పిన సందర్భాలు లేవు.

 మ్యాచ్ చూసేందుకు వెళ్లి..

మ్యాచ్ చూసేందుకు వెళ్లి..

అసిన్ తన భర్త రాహుల్ శర్మను తొలిసారి కలిసిన సందర్భాన్ని మాత్రం తన అభిమానులతో షేర్ చేసుకొంది. నాలుగు సంవత్సరాల క్రితం మైక్రో మ్యాక్స్ ఆసియాకప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మైక్రో మ్యాక్స్ సహవ్యవస్థాపకుడైన రాహుల్ శర్మ టోర్నీ నిర్వాహకుడి హోదాలో భారత్, పాక్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఆ మ్యాచ్ చూసేందుకు అసిన్ బంగ్లాదేశ్ వెళ్లింది. ఈ సందర్భంగా తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని అసిన్ తెలిపింది. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ను చూసేందుకు వీరిద్దరూ బంగ్లాదేశ్ వెళ్లారు. మ్యాచ్ ను వీక్షించి, అప్పటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నామని అసిన్ తెలిపింది.

 నా ప్రపంచాన్ని కౌగిట్లో..

నా ప్రపంచాన్ని కౌగిట్లో..

పెళ్లి రోజు అసిన్ కొన్ని ఫోటోలను పోస్టు చేసి, తనకు పెళ్లయిన విషయాన్ని అభిమానులకు తెలియజేసింది. రాహుల్ శర్మ మాత్రం వాటన్నింటికీ దూరంగా ఉన్నాడు. వివాహానంతరం తొలిసారి అసిన్ ను గుండెలకు హత్తుకున్న ఫోటోను నేడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, 'నా ప్రపంచాన్ని రెండు చేతులతో బంధించాను' అంటూ వ్యాఖ్య పెట్టారు. దీనికి వారి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

 సక్సెస్ లేనప్పుడు

సక్సెస్ లేనప్పుడు

నటి అసిన్‌ సినీ రంగంలో పూర్తి స్థాయిలో అవకాశాలు కోల్పోవడంతో తీవ్ర ఆవేదనతో ఉన్నప్పుడు ఈ ప్రేమ సంభవించింది. గతంలో అమ్మా..నాన్నా..ఓ తమిళ అమ్మాయి ( 'ఎం కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి' )చిత్రం ద్వారా తమిళ తెరపైకి వచ్చి వరుస విజయాలు దక్కించుకున్న అసిన్‌ నటుడు సూర్యతో కలిసి 'గజినీ' చిత్రంలో నటించి మరింత ఉన్నత స్థాయికి చేరారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ బాట పట్టారు.

షూటింగ్ టైమ్ లోనే ..

షూటింగ్ టైమ్ లోనే ..

హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వూహించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో అవకాశాలు కోల్పోయారు. చాలాకాలం తర్వాత మళ్లీ 'ఆల్‌ ఇన్‌ వెల్‌' చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌తో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగానే ప్రముఖ మొబైల్‌ సంస్థ 'మైక్రోమేక్స్‌' యజమానితో ఈమెకు ప్రేమ కుదిరిందని, వీరి వివాహం త్వరలో జరుగనుందంటూ వార్తలు వెలువడాయి. ఇదిలా ఉండగా 'ఆల్‌ ఇన్‌ వెల్‌' చిత్రం విజయం సాధించకపోవడంతో ఆవేదనలో కూరుకుపోయింది.

 ఒకే రోజు రెండు సార్లు

ఒకే రోజు రెండు సార్లు

ఈ జంట వివాహం కూడా డిఫరెంట్ స్టైలో జరిగింది. అసిన్ క్రిస్టియన్ కావడం, రాహుల్ హిందూ కావడంతో ఇద్దరి మత సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. జనవరి 19వ తేదీ ఉదయం చర్చి వెడ్డింగ్ జరిగింది. సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ రెండు పెళ్లిళ్లు ఢిల్లీలోనే జరిగాయి.

 నాలుగు సంవత్సరాలు..

నాలుగు సంవత్సరాలు..

వివాహం చేసుకోవడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు అసిన్-రాహుల్ శర్మ డేటింగ్ చేసారు. అసిన్-రాహుల్ వివాహం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంలా జరిగింది.కాగా... అసిన్-రాహుల్ శర్మ వివాహానికి ప్రధాన కారకుడైన హీరో అక్షయ్ కుమార్ ఈ వివాహ వేడుకలో ఉషారుగా పాల్గొన్నారు. ఈ రెండు ఫ్యామిలీలు ఇక్కడ ఓ రోజు కలిసి పార్టీ చేసుకున్నారు.

 కోట్లకు అధిపతి కావటంతో..

కోట్లకు అధిపతి కావటంతో..


ఈ ఫోటోలు చూసిన వారంతా.... వేల కోట్లకు అధిపతి అయిన రాహుల్ శర్మను పెళ్లాడిన అసిన్ విలాసాలకు ఏమాత్రం కొదవలేదు. ఆమె చాలా అదృష్టవంతురాలు, ప్రియుడే భర్తగా రావడంతో ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 విదేశాల్లో పర్యటిస్తూ...

విదేశాల్లో పర్యటిస్తూ...

రాహుల్ తో పరిచయం తర్వాత అసిన్ సినిమా రంగాన్ని క్రమక్రమంగా వదిలేసింది. ఈ కొత్త జంట కొంత కాలంగా విదేశాల్లో పర్యటిస్తూ విలాసంగా గడుపుతున్నాయి. ప్రస్తుతం ఈ జంట ఇటలీలో గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం అసిన్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. విదేశాల్లో వీరు బస చేసిన హోటల్స్, తిరుతున్న ప్రదేశాలు చాస్తే.. అత్యంత ఖరీదైన ప్రాంతాలని స్పష్టమవుతోంది.

English summary
Actress Asin tied the knot with businessman Rahul Sharma in January this year (2016). Their love story was no less than a fairytale. We will tell you everything about their romantic journey in detail later but first check out the latest picture of the lovely couple clicked at a wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu