For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు తెలియకుండానే కళ్ళకి నీళ్ళు వచ్చేశాయ్: "అర్జున్ రెడ్డి" గీత రచయిత రాంబాబు గోశాల (ఇంటర్వ్యూ)

  |

  ప్రపంచం లొ ఎక్కడా లేని లక్షణం ఇండియన్ సినిమాకి మాత్రమె ఉంది... "సినిమా మధ్యలో పాట" ఉండటం. ప్రపంచ సినిమా మొత్తాన్నీ కలిపి చూసినా పాటకి ఇచ్చే ఇంపార్టెన్స్ మరెక్కడా కనిపించదు. అందుకే మనదగ్గర సినిమా ఫ్లాప్ అయినా ఆడియో హిట్ అవుతుంది కానీ ఆడియో ఫ్లాపైతే ఆ ప్రభావం సినిమా మీద కుడా ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమాకి కథ ఎంత ముఖ్యమో పాట కుడా అంతే ముఖ్యం....

  ఈ మధ్య టాలివుడ్ కి ఒక ఫీవర్ తగిలింది. దాని పేరు "అర్జున్ రెడ్డి" ఒక్క తెలుగు సినిమా మీద ఇంత చర్చ జరగటం బహుశా కొన్ని సంవత్సరాలలో ఇదే మొదటిసారేమో. సినిమా లోని ప్రతీ క్రాఫ్ట్ నీ ఇంత పక్కా గా వాడుకున్న సినిమా కుడా ఇదేనేమో అందుకే ఈ సారి చాలా పేర్లే వినిపించాయ్. ఇకముందు వినిపిస్తాయి కూడా. అలా పాతదే అయినా కొత్తగా వినిపించిన పేరు రాంబాబు... గోశాల రాంబాబు. ఎక్కడో మారుమూల పిల్లవాడు.. సినిమా అంటే ఒక అద్బుతం అనుకున్న కృష్ణా జిల్లా కుర్రవాడు ఇంతకాలం ఎక్కడ ఉన్నాడు? పాటగా వినిపించినా... కవిగా పెద్దగా కనిపించని రాంబాబు అర్జున్ రెడ్డి తో ఒక్కసారి తానూ వినిపించటం నుంచి కనిపించేదాకా ఎం చేసాడు?? ఒక్కసారి తెలుసుకునె ప్రయత్నం లో ఫిల్మీబీట్., గోశాల రాంబాబు గారిని కదిలించినప్పుడు ఇలా తనగురించి తానూ రాసుకున్నాడు... పాటగా తానూ మారటానికి ఇంతకాలం తానూ చేసిన ప్రయాణాన్ని ఇలా చెప్పుకొచ్చారు....

  హాయ్ రాంబాబు గారూ..! ఎలా ఉంది అర్జున్ రెడ్డి కిక్ ఇంకా దిగినట్టు లేదు

  హాయ్ రాంబాబు గారూ..! ఎలా ఉంది అర్జున్ రెడ్డి కిక్ ఇంకా దిగినట్టు లేదు

  ఇప్పుడప్పుడే ఈ కిక్ వదిలేలా లేదు.. ఇంకా అర్జున్ రెడ్డి తోనే ఉన్నట్టుంది. అందులోను ఎక్కువగా అర్జున్ రెడ్డి గురించి ఆలోచించానేమో నన్ను కాస్త గట్టిగానే పట్టుకున్నాడు. రియల్లీ వెరీ హ్యాపీ.

  పాటలు రాయటానికి ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ అవసరం అయ్యిందా...

  పాటలు రాయటానికి ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ అవసరం అయ్యిందా...

  చెప్తే నవ్వుకుంటారు గానీ....! ఆ క్యారెక్టర్నీ మాములుగా చూస్తే పని అవ్వదు.. చాలా టైం పట్టినట్టు అనిపించింది కానీ తప్పదు ఎప్పుడొ తప్ప ఇలాంటి సబ్జెక్ట్ దొరకదు., పట్టు పట్టి రాయించే సందీప్ లాంటి డైరెక్టర్ కుడా., నిజానికి అర్జున్ రెడ్డి నీ ఒక క్యారెక్టర్ గా అనుకుంటే రాయలేకపోయేవాన్ని... 'ఊపిరాగుతున్నదె.." రాసేటప్పుడు నాకు తెలియకుండానే కళ్ళకి నీళ్ళు వచ్చేసాయ్.. అప్పుడనిపించింది రేపు అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ ఎందరిని మూవ్ చేయగలదో.. అని..

  ఇప్పుడే అర్థమవుతోంది ఎంతగా కనెక్ట్ అయ్యారో..... ఆపకుండా చెప్పేస్తున్నారు..

  ఇప్పుడే అర్థమవుతోంది ఎంతగా కనెక్ట్ అయ్యారో..... ఆపకుండా చెప్పేస్తున్నారు..

  హ..హ..! చెప్పాను కదా..!! తెలియకుండానే నాలోపలికి అర్జున్ రెడ్డి నీ ఇంజెక్ట్ చేసేసారు సందీప్ గారు, లేదంటే అలాంటి అవుట్ పుట్ సాధ్యమయ్యేది కాదు . నిజానికి టీమ్ మొత్తం కూడా అర్జున్ రెడ్డి ఒక సినిమాలో క్యారెక్టర్ మాత్రమే అనుకోలేదు.. ప్రాజెక్ట్ నడుస్తున్నంత సేపు ఒక బయో పిక్ తీస్తున్నట్టె అనుకున్నారు ఫలితం మీరు చూస్తున్నారు కదా..

  కాస్త మీ గురించి కుడా చెప్పండి.. ఇంతకీ మీరు ఈ లైన్ లోకి ఎలా వచ్చారు? సాహిత్యం ఎలా అలవాటయ్యింది.

  కాస్త మీ గురించి కుడా చెప్పండి.. ఇంతకీ మీరు ఈ లైన్ లోకి ఎలా వచ్చారు? సాహిత్యం ఎలా అలవాటయ్యింది.

  వేలుపు చర్ల అనే ఒక ఊరు.. చెప్పగానే తెలిసి పోయేంత పెద్ద ఊరు కాదు గానీ చాలా అన్దమైన ఊరు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం లో ఉండే చిన్న ఊరు.. నిజానికి పదోతరగతి వచ్చేదాకా పెద్దగా సాహిత్యం చదివింది లేదు.. అప్పుడప్పుడు దొరికిన పుస్తకం మాత్రం చదివేవాన్ని. ఇక పాటలంటే పిచ్చి మాత్రం ఉండేది... "బాల సుబ్రహ్మణ్యం హిట్స్" అనే ఒక పుస్తకం దాచుకుని అదే పనిగా ఆ పాటలన్నీ పాడుకునే వాణ్ని . అప్పుడే నాకు తెలియకుండానే వేటూరి గారి సాహిత్యం ఎక్కువ నచ్చి ఆయనకీ ఫ్యాన్ అయ్యాను . అలా 7 వ తరగతి వరకూ మా ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత అయిదు కిలోమీటర్ల దూరం లొ ఉన్న కొప్పాక కి రోజు నడిచి వెళ్ళే వాళ్ళం అక్కడ టెన్త్ వరకూ.., బాల్యం అలా గడిచిపోయింది.

  చదవటం నుంచి రాయటం ఎలా మొదలయ్యింది...?

  చదవటం నుంచి రాయటం ఎలా మొదలయ్యింది...?

  ఇంటర్మీడియట్ కి వచ్చాక సినిమాలు చూడటం ఎక్కువయ్యింది అప్పుడే సినిమాల్లో రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మొదలయ్యింది.. ఎప్పుడో ఒకటి చిన్నగా రాసుకొని పాడుకునే వాణ్ని ఎవరన్నా వింటే నవ్వుతారేమో అనిపించి తర్వాత రాసింది చించి పదేసేవాన్ని.. అలా పడేసినా సినిమాలకి రాయాలన్న ఆలోచనమాత్రం పోయేది కాదు. అయితే ఆ ప్రభావం నా చదువు మీద పడలేదు... ఆ తర్వాత ఏలూరులో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ కి వినిపించేవాన్ని.. ఫేర్వెల్ పార్టీలొ అందరిపేర్లు వచ్చేలాగా ఒక పాట రాసి నేనే పాడాను అప్పుడు చాలామంది చెప్పారు నువ్వు సినిమాలవైపు వెళ్ళొచ్చు కదా అని.. అంతే నా తర్వాతి గమ్యం టాలివుడ్ అనుకున్నాను... హైదరాబాద్ వచ్చేసాను..

  సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు ఇంట్లో అడ్డు చెప్పలేదా? ఇంజినీరింగ్ చదివి సినిమాల్లోకి వెళ్ళటం ఏమిటని

  సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు ఇంట్లో అడ్డు చెప్పలేదా? ఇంజినీరింగ్ చదివి సినిమాల్లోకి వెళ్ళటం ఏమిటని

  ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి... అమ్మా నాన్నా ఇద్దరూ వ్యవసాయ కూలీలు వాళ్లకి తెలిసింది ఒక్కటే మమ్మల్ని పెంచటం.. వీలైనంత వరకు మాకు భాద అనిపించకుండా చుసుకోవటం. నేను హైదరాబాద్ వెళ్తున్నా అన్నప్పుడు.

  సరే జాగ్రత్త..! అనటం తప్ప ఒక్క మాట కుడా డిసప్పాయింట్ గా మాట్లాడలేదు.. (కళ్ళలో సన్నటి నీటి తెర) తమ్ముడు, చెల్లి కుడా నాకు సక్సెస్ వచ్చేంత వరకు ఎన్నడు ఆ ప్రయత్నాలు అవసరమా అన్నట్టుగా మాట్లాడలేదు..

  ఇక్కడికి వచ్చిన వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టారా.. అవకాశం ఎలా వచ్చింది?

  ఇక్కడికి వచ్చిన వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టారా.. అవకాశం ఎలా వచ్చింది?

  వచ్చిన వెంటనే అవకాసం వస్తే అది జీవితం ఎలా అవుతుందండీ? ఇక్కడికి వచ్చాక మొట్టమొదటి ప్రాబ్లం డబ్బు ఆకలి తీర్చుకోవటానికైనా ఏంటో కొంత ఉండాలి కదా.. అటు సినిమాల్లో ట్రై చేస్తూనే ఇంకోపక్క జాబ్ కోసం వెతికేవాన్ని. ఎస్సార్ నగర్ లో ఉండే లైబ్రరీ నా పర్మినెంట్ అడ్డా... ఎ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ కూచుని చదువుతూ ఉండేవాన్ని... ఆ సమయం లో నాలుగేళ్ళు నా ఫ్రెండ్సే నాకు అమ్మా నాన్నలయ్యారు. కనీసం నేను అడిగే అవసరం కూడా లేకుండా అన్ని అవసరాలు చూసేవాళ్ళు...మోహన్, ఫణి, మురళి ఇలా... ఒక్కడంటే ఒక్కడన్నా "ఏంట్రా ఇదీ..? ఈ ప్రయత్నాలు ఎన్నాళ్ళు?" అనలేదు. ఒక రకంగా వాళ్ళు లేకపోతె నేను లేనట్టే... నాకున్న అన్ని భాదల్లోను అన్ని సంతోశాల్లోను వాళ్ళు ఉన్నారు.. నిజానికి కొన్ని సార్లు "అర్జున్ రెడ్డి' అన్నట్టే లైఫ్ లో ఇది ఒక ఫేజ్ మాత్రమే ఇదిలాగే ఉండదు అంటూ చెప్పేవాళ్ళు...

  మొదటి అవకాసం ఎలా వచ్చింది?

  మొదటి అవకాసం ఎలా వచ్చింది?

  ఇటు జాబ్ వెతుకుతూనే అటు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.. అప్పుడు కూడా నా ఇంజినీరింగ్ ఫ్రెండ్ మాగంటి రాము (ఏలూరు ఎమ్పీ గారబ్బాయి . వాళ్ళ నాన్నగారు కొన్ని సినిమాలకి ప్రొడ్యుసర్ గా చేసారు. సో..! ఆయనకీ ఈవీవీ సత్యన్నారాయణ గారు ఫ్యామిలీ ఫ్రెండ్.) సడెన్ గా ఒక రోజు ఫోన్ చేసి ఒక విషయం చెప్పాడు. దర్శకులు ఈ.సత్తి బాబుగారు ఈవీవీ గారి బందువు, ఆయన ఒక సినిమా తీస్తున్నారనీ ఆయన్ని కలవమనీ చెప్పాడు. అంతే సత్తిబాబు గారి దగ్గరికి పరుగెత్తుకు వెళ్లాను...

  "సరే నేను కబురు పెడతాను లే" అన్నారు

  పిల్లవాడని చూడకుండా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారాయన నా దగ్గర ఉన్న కొన్ని పాటలని ఆయనకీ చూపించాను.. అన్నీ చూసారు, ఓపిగ్గా విన్నాక "సరే నేను కబురు పెడతాను లే" అన్నారు... ఆ తర్వాత రెండు ముడు నెలల వరకూ మళ్ళీ ఎ కబురూ లేదు. ఆయనకి నచ్చలేదేమో ఇక అయిపోయినట్టే అనుకున్నా . ఆశ వదిలేసుకుంటున్న సమయం లో ఒకరోజు పొద్దున్నే కాల్ చేసి "రాంబాబు..! మొన్న నువ్వు తెచ్చిన పాటలన్నీ తీసుకుని వెంటనే ఆఫీస్కి వచ్చెయ్యి" అన్నారు. వెళ్ళేసరికే అక్కడ శ్రీధర్ గారూ, రమణ గోగుల గారు ఉన్నారు. కొన్ని పాటలు వినిపించాక ఒక్కపాట రాసే అవకాసం ఇచ్చారు అలా "వియ్యాల వారి కయ్యాలు" సినిమా తో నా ప్రయాణం మొదలయ్యింది. .

  సో అలా మొదలయ్యారు. ఆ తర్వాత అవకాశాలు మొదలయ్యాయి అన్నమాట...

  సో అలా మొదలయ్యారు. ఆ తర్వాత అవకాశాలు మొదలయ్యాయి అన్నమాట...

  అవకాశాలు వచ్చిన మాట నిజమే గాని.. చేతి వరకూ వచ్చి నోటికందనివే ఎక్కువ... కొన్ని సినిమాలు మధ్యలొ ఆగిపోయాయి. అవకాసం వచ్చింది అని సంతోషపడే లోపే సినిమా ఆగిపోవటమో, లేదా నన్ను మార్చేయ్యటమో జరిగేది. మళ్ళీ పోరాటం మొదలు... అలా వచ్చిన గ్యాప్ లోనే నా అభిమాన గీత రచయిత వేటూరి గారి పరిచయం కలిగింది. అప్పుడప్పుడు వెళ్ళే వాన్ని కానీ.. నా దురదృష్టం.., ఆ తర్వాత కొన్నాల్లకే ఆయన మరణించారు... ఇక ఇలా కాదనుకొని చక్కగా వెళ్ళిపోయి ICICI బ్యాంక్ లో చేరిపోయాను.. అయితే అక్కడ సంత్రుప్తి లేదు కానీ తప్పదు కదా, అలా అయిదేళ్ళు గడిపేశాను .. మధ్య మధ్యలో ఇండస్ట్రీలో ప్రయత్నాలూ ఆపలేదు..

  ఉయ్యాల జంపాలా సినిమాకి కూడా రాశారు కదా..! విరించి గారితో ఎలా ఉండేది పనిచేయటం...

  ఉయ్యాల జంపాలా సినిమాకి కూడా రాశారు కదా..! విరించి గారితో ఎలా ఉండేది పనిచేయటం...

  అవును నేను ట్రయల్స్ లో ఉన్నప్పుడే విరించి గారు కొంత పరిచయం.. అలా ఉయ్యాల జంపాలా సినిమా తీస్తున్నప్పుడు ఆయన గుర్తుంచుకుని మరీ నాతో "నిజంగా ఇది నేనేనా పాట రాయించారు. విరించి తో పని చేయటం అంటే మనం కావాలని పని చేస్తున్నట్టుండదు. ఆ టైం కి అది జరగాలి కాబట్టి అక్కడ ఉన్నాం అనిపిస్తుంది.. ఆతర్వాత నాని తో మజ్ఞు తీస్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా "జారే..జారే.." పాట రాసాను.. ఆతర్వాత అప్పట్లో ఒకడుండేవాడు లో వచ్చే బిట్ సాంగ్ కూడా నేను రాసిందే.. అయితే అది ఒక దండకం లాఉంటుంది... ఇంద్రగంటి మోహన కృష్ణ గారి "బందిపోటు" లోనూ, ఈ మధ్య వారాహీ బ్యానర్ లో జగపతిబాబు గారు హీరోగా వచ్చిన పటేల్ సార్ కోసం టైటిల్ సాంగ్ కూడా చెప్పుకోదగ్గ అవకాశాలే...

  మరి అర్జున్ రెడ్డి ఎలా దొరికాడు?

  మరి అర్జున్ రెడ్డి ఎలా దొరికాడు?

  "వియ్యాలవారి కయ్యాలు" సినిమాకి రాస్తున్న సమయం లోనే ఆ సినిమా కో డైరెక్టర్ ఉమేష్ గారు పరిచయం అయ్యారు. ఆయనా ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాకి కెమెరామెన్ గా చేసిన రాజ్ తోట ఇద్దరూ స్నేహితులు. అలా ఉమేష్ గారి వల్ల రాజ్ గారూ, కో డైరెక్టర్ గిరీష్... ఆయన ద్వారా సందీప్ గారి వరకూ వచ్చాను.

  అర్జున్ రెడ్డి సబ్జెక్ట్ విన్నప్పుడు ఏమీ ఇబ్బంది అనిపించలేదా.?

  అర్జున్ రెడ్డి సబ్జెక్ట్ విన్నప్పుడు ఏమీ ఇబ్బంది అనిపించలేదా.?

  అందులో ఇబ్బంది అనిపించటానికి ఏముందీ... ఆ క్యారెక్టర్ బిహేవియర్ తెరమీద కొత్తవేమో గానీ మనచుట్టూ ఉండే జీవితాల్లో ఎన్ని చూదలేదు. ఓ..! ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. అందులోనూ సందీప్ రెడ్డ్య్ గారు కథ మనకి చెప్పే విధానం వేరుగా ఉంటుంది. మనకళ్ళముందు అర్జున్ రెడ్డి నిల్చొని తనకథ చెప్తున్నట్టే అనిపించింది. నిజానికి నేను ముందుగా రాసింది క్లైమాక్స్ లో వచ్చే "ఊపిరాగుతున్నదే" సాంగ్. అది విన్నాక బ్రేకప్ టైంలో వచ్చే పాట కూడా నాకే ఇచ్చారు.. అలా అర్జున్ రెడ్డి నాకు ఫ్రెండైపోయాడు.

  చాలానే స్ట్రగుల్ పడ్డారు మధ్యలో ఒకసారి పైకి వచ్చి మరీ గ్యాప్ లో పడ్డారు మరి ఇప్పుడెలా ఉందీ..? అర్జున్ రెడ్డి తర్వాత మార్పేమైనా ఉందా??

  చాలానే స్ట్రగుల్ పడ్డారు మధ్యలో ఒకసారి పైకి వచ్చి మరీ గ్యాప్ లో పడ్డారు మరి ఇప్పుడెలా ఉందీ..? అర్జున్ రెడ్డి తర్వాత మార్పేమైనా ఉందా??

  చాలా...! స్ట్రగుల్ అంటే ఒప్పుకోను, చెప్పాను కదండీ లైఫ్ లో అదీ ఒక స్టేజ్ అంతే.. అర్జున్ రెడ్డికి ముందూ తెలిసిన మిత్రులు అవకాశం ఇవ్వటం వల్లే కదా ఇంతవరకూ వచ్చాను.. ఇప్పుడు కొంచం కెరీర్ స్పీడందుకుందనే అనిపిస్తోంది.. ఇప్పటికైతే వరుసగా పెద్ద బ్యానర్ అవకాశాలు మూడు ఉన్నాయి. ఇంకా ఒకటి ఓకే అవ్వొచ్చు. స్టార్ హీరోల సినిమాలే అయితే ఇప్పుడే ఆ వివరాలు బయటికి చెప్పలేను.

  నెక్స్ట్...! వేణూ ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న

  నెక్స్ట్...! వేణూ ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న "నీదీ నాదీ ఒకే కథ" లో కూడా రాస్తున్నట్టు విన్నాం.

  యెస్..! నిజానికి వేణుగారు నాకు చాలాకాలంగా తెలుసు, దాదాపుగా ఉమేష్, రాజ్ ఇలా వీళ్ల పరిచయం ఉన్న సమయం నుంచే.. అయితే ఈ పాట రాయటానికీ మా ఫ్రెండ్షిప్ కీ ఏ సంబందమూ లేదు. "నీదీ నాదీ ఒకే కథ" లో ఆ దమ్ము ఉంది. వేణుకి తన మీదా తన కథ మీదా అన్నిటికంటే ఇంకా ఎక్కువగా తన టీమ్ మీదా నమ్మకం ఉంది... ఆ నమ్మకం తోనే నన్నూ కలుపుకున్నాడు. అలా మా ఇద్దరి కథా ఒక్కటయ్యింది... ఇక ప్రత్యేకంగా ఆ పాట నాకు చాలనచ్చిన వాటిల్లో ఒకటి. మంచి మెలోడీ అలాంటి అవకాశం వెంట వెంటనే రాదు.. సినిమా చూస్తారు కదా..! మనం ఇప్పుడే చెప్పటం ఎందుకూ., చూసిన వాళ్ళు చెప్తూంటే ఉండే ఆనందం వేరు...

   నా నిర్ణయం సరైంది కాదేమో, ఇటువైపు రావాల్సింది కాదూ అనుకున్న సంధర్భం ఏమైనా ఉందా?

  నా నిర్ణయం సరైంది కాదేమో, ఇటువైపు రావాల్సింది కాదూ అనుకున్న సంధర్భం ఏమైనా ఉందా?

  హ్మ్మ్! సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవసరాలకోసం ఫ్రెండ్స్ మీద ఆధారపడి, సరైన జాబ్ దొరక్క తిరుగుతున్న రోజుల్లో అనిపించింది.. కానీ మళ్ళీ వెంటనే అనిపించేది... జాబ్ ఇంకో పదేళ్ళకైనా వస్తుంది కానీ ఇప్పుడు ప్రయత్న ఆపితే ఇక జీవితాంతం నా ఎయిమ్ ని మిస్సయ్యానని భాదపడుతూనే ఉంటాను కదా..! అని... మళ్ళీ అలా ఎప్పుడూ అనుకోలేదు..

  ఇంటిదగ్గ పరిస్తితేమిటీ..? అంటే నాన్నా, అమ్మగారూ ఎలా ఫీలవుతున్నారు?

  ఇంటిదగ్గ పరిస్తితేమిటీ..? అంటే నాన్నా, అమ్మగారూ ఎలా ఫీలవుతున్నారు?

  ఎలా ఫీలవుతారు.. ఇప్పటికీ పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలనే చూస్తూంటారు. నేను ఇవాళ ఉన్న పొజిషన్ వాళ్ళు ఊహించనిదేమీ కాదు అయితే ఇంజినీరుగా అయితే కాస్త ముందుగా ఆనందించేవాళ్ళేమో. ఇప్పటికి చెల్లెలికీ, తమ్ముడికీ పెళ్ళి భాధ్యతలు తీరిపోయాయి ఇక నాకు మిగిలింది వాళ్ళ భాధ్యతే నేను సెటిలైతే చూడాలనుందనే మాట తప్ప నువ్వు ఏం చేస్తున్నావ్, ఎలా ప్లాన్ చేస్తున్నావ్ అని ఆలోచించరు, వాళ్ళకి నేను ఇలా ఉండటం వల్ల సంతోషంగా ఉన్నాను అన్నది ఆనందం... తొందరలోనే వాళ్ళనీ నాదగ్గరికి తెచ్చేసుకోవాలి..

  ఆ రోజు కూడా తొందరలోనే రావాలని కోరుకుంటున్నాం... చివరగా ఒక్క ప్రశ్న., మీలా ఇండస్ట్రీకి వచ్చే కొత్త రైటర్లకి ఎదైనా సలహా ఇవ్వమంటే మీరేం ఇస్తారు..

  ఆ రోజు కూడా తొందరలోనే రావాలని కోరుకుంటున్నాం... చివరగా ఒక్క ప్రశ్న., మీలా ఇండస్ట్రీకి వచ్చే కొత్త రైటర్లకి ఎదైనా సలహా ఇవ్వమంటే మీరేం ఇస్తారు..

  సలహాలు ఇస్తే వినండి తర్వాత మర్చిపోండి... అంతే..! ఎందుకంటే ఎవరి జీవితం ఎలా ఉండాలో వాళ్ళకు మాత్రమే తెలుసు. నా సలహా ఒక ఊరట అయితే పరవాలేదు కానీ వాళ్ళ ఆలోచనని మారిస్తే అది నా దృష్టిలో నేరం.. అందుకే వాళ్ళ ఆలోచన వాళ్ళని చేసుకొమ్మంటాను..

  English summary
  Chit Chat with Rambabu Goshala who is Liric writer for latest crazy Movie Arjun reddy in Tollywood directed by Sandeep reDDy Vanga
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X