»   » డ్రగ్స్ కేసు: చార్మి అంత గొప్ప మహిళా?... రచయిత జొన్నవిత్తుల ఫైర్!

డ్రగ్స్ కేసు: చార్మి అంత గొప్ప మహిళా?... రచయిత జొన్నవిత్తుల ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్లను విచారించిన పోలీసులు బుధవారం హీరోయిన్ చార్మిని విచారించారు.

విచారణ అనంతరం బయటకు వస్తున్న చార్మిని చూసి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ కామెంట్ విసిరారు. చార్మీని టీవీ చానళ్లలో చూసిన వర్మ... ఆమె తనకు జ్యోతిలక్ష్మిలా కనిపించడం లేదని, వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయిలా కనిపిస్తోందంటూ కామెంట్ చేశారు. అయితే చార్మి లాంటి సాధారణ నటిని.... ఝాన్సీ లక్ష్మీభాయి వీరనారితో పోల్చడంపై రచయిత జొన్నవిత్తుల మండి పడ్డారు.

చార్మి ఏం చేసిందని?

చార్మి ఏం చేసిందని?

చార్మిని ఝాన్సీ లక్ష్మీభాయి లాంటి వీరనారితో పోల్చడం సరికాదు..... అంత గొప్ప పనులు చార్మి ఏం చేసింది? చరిత్రలోని గొప్ప వ్యక్తులు, దేశ భక్తులతో పోల్చినపుడు దానికి తగిన కారణం కూడా ఉండాలి అనే అభిప్రాయం జొన్నవిత్తుల వ్యక్తం చేశారు.

Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
వాళ్లేమీ ఆంగ్లేయులు కాదే

వాళ్లేమీ ఆంగ్లేయులు కాదే

వర్మ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అతడు చేసింది చాలా ఇబ్బందికర వ్యాఖ్య..... ఎందుకంటే చార్మి వీరనారి కాదు, సిట్ అధికారులు ఆంగ్లేయులు అంతకన్నా కాదు అని జొన్నవిత్తుల అన్నారు.

దేశభక్తికి ప్రతీక

దేశభక్తికి ప్రతీక

ఆంగ్లేయులపై పోరాడిన ఝాన్సీ లక్ష్మిభాయిని దేశభక్తికి, సాహసానికి, పరాక్రమానికి, త్యాగానికి ప్రతీక. చార్మి ఒక సాధారణ నటి. ఆమె దేశ భక్తికి, పరాక్రమానికి, సాహసానికి సంబంధించిన పనులేమీ చేయలేదు. వర్మ సిట్‌పై ఆయన అభిప్రాయాలను చెప్పవచ్చు. కానీ, దేశభక్తురాలితో చార్మిని పోల్చడం తగదు జొన్నవిత్తుల అభిప్రాయపడ్డారు.

ఇలా అనొచ్చు

ఇలా అనొచ్చు

డ్రగ్ కేసులో అనుమానితురాలిగా చార్మిని పిలిచి, సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ముగించుకుని బయటకు వచ్చినప్పుడు, ఆవిడ నిబ్బరంగా ఉందని అనొచ్చు. లేకుంటే, మరో విధంగా ఆమెను ప్రశంసించవచ్చు... అలా అంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, దేశభక్తురాలు ఝాన్సీ లక్ష్మి భాయితో పోలిస్తే చాలా మంది నొచ్చుకునే అవకాశం ఉంది అని జొన్నవిత్తుల అన్నారు.

English summary
Lyricist jonnavithula objection on Ram Gopal Varma's comment. Director Ram Gopal Varma, who always searches for something special, tweeted saying that Charmy is not a Jyothi Lakshmi, but a 'Jhansi Lakshmi Bai'. His another tweet says, 'Going by Charmme's contended and ultra happy expression it looked as if it is she who interrogated their team'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu