twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెట్టుదిగిన దిల్ రాజు, హరీష్ శంకర్: ‘డిజె’ నుండి అవి తొలగింపు!

    డిజె మూవీ పాట నుండి న‌మ‌కం..చ‌మ‌కం అనే పదాలను తొలగించారు. నా గ‌మ‌కం..నీ సుముఖం అనే ప‌దాల‌తో వాటిని రీప్లేస్ చేశారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'డిజె-దువ్వాడ జగన్నాథం' మూవీలోని పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అత్యంత పవిత్రమైన న‌మ‌కం..చ‌మ‌కం అనే ప‌దాల‌ను శృంగార సంబంధమైన సీన్లలో వాడటంపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

    బ్రాహ్మణ సంఘాలు దర్శక నిర్మాతలను కలిసి ఈ పదాలను తొలగించాలని కోరగా.... వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం చెందిన వారంతా హ్యూమన్ రైట్స్ కమీషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సినిమాపై వివాదం ముదిరితే నష్టపోయేది తామే అని భావించిన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ మెట్టుదిగారు.

    పదాలను తొలగిస్తూ ప్రకటన

    పదాలను తొలగిస్తూ ప్రకటన

    `అస్మైక యోగ త‌స్మైక భోగ‌..` అనే పాట‌లో `న‌మ‌కం..చ‌మ‌కం..` అనే ప‌దాలపై అభ్యంత‌రాలు వ్యక్తం అయిన నేపథ్యంలో వాటిని తొలగిస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

    ఆ పదాల స్థానంలో

    ఆ పదాల స్థానంలో

    సెన్సార్ స‌మ‌యంలోనే న‌మ‌కం..చ‌మ‌కం అనే ప‌దాల‌ను మార్చి వాటి స్థానంలో నా గ‌మ‌కం..నీ సుముఖం అనే ప‌దాల‌ను పొందుప‌రిచారు. ఆ పదాలను మార్చడం వల్లనే సెన్సార్ స‌భ్యుల నుండి అమోదం లభించిందట. సినిమాలో, ఇక‌పై రానున్న ఆల్బ‌మ్స్ అన్నింటిలో కొత్త ప‌దాల‌తో కూడిన పాట విన‌ప‌డుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

    తప్పులేదంటూ వాదించిన హరీష్

    తప్పులేదంటూ వాదించిన హరీష్

    అయితే గతంలో హరీష్ శంకర్.... పాటలో అలాంటి పదాలను పెట్టడాన్ని సమర్ధించుకున్నారు. ఒక అగ్రహారంలో ఉండే కుర్రాడు తన పరిధిలో ఉండే వస్తువులతో తన ప్రేమను కంపేర్ చేసుకుంటాడు. అందుకే అగ్రహారంలో ఉన్న తమళపాకు అంటాడే తప్ప పాకిస్థాన్లో ఉండే తమిళపాకు గురించో మామిడాకు గురించో మాట్లాడడు... అని హరీష్ శంకర్ తెలిపారు.

    తాను బ్రాహ్మణుడినే

    తాను బ్రాహ్మణుడినే

    తాను బ్రహ్మణుడినే...... అగ్రహారంలో ఉండే తమళపాకు అభిషేకాలకు, పూజలకు వాడతారు... పవిత్రంగా, కొత్తగా ఉంటుంది, వాడిన తమళపాకును మళ్లీ పూజకు వాడరు. ఈ ప్రేమ అనే ఫీలింగ్ కొత్తగా ఉంది అని చెప్పడంలో భాగంగా ఓ బ్రాహ్మణ కుర్రాడు అగ్రహారం తమిళపాకు అంటాడే తప్ప ఈ తమకం... చికెన్ ముక్కలా ఉందని అనడు... అనకూడదు. కొంతమంది ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడంటూ హరీష్ శంకర్ అప్పట్లో సమర్థించుకున్నారు.

    మాట ఇచ్చి తప్పడంతో బ్రాహ్మణులు ఫైర్

    మాట ఇచ్చి తప్పడంతో బ్రాహ్మణులు ఫైర్

    ఈ వివాదం విషయమై బ్రాహ్మణ సంఘాల నేతలు హరీష్ శంకర్ ను కలవగా ఆ పదాలను తొలగిస్తామని మాట ఇచ్చారు. అయితే ఆడియో వేడుకలో ఆ పదాలతోనే కూడిన పాటలు వినిపించడంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మణ సంఘాలు హ్యూమన్ రైట్స్ కమీషన్ ను ఆశ్రయించాయి. ఆ తర్వాత దిల్ రాజు, హరీష్ శంకర్ ఓ మొట్టుదిగక తప్పలేదు.

    English summary
    Lyrics changed in Duvvada Jagannadham song. The lyrics “Namakam Chamakam” from the song “Asmaika Yoga Tasmaika Bhoga” were replaced with “Naa Ghamkam Nee Sumukham”. The changed lyrics will be replaced in all the Audio tracks, in both digital version and CD versions from now on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X