»   » ‘ఒక్కడు’స్టార్ట్ అవ్వడం వెనుక... : ఎమ్మెస్ రాజు

‘ఒక్కడు’స్టార్ట్ అవ్వడం వెనుక... : ఎమ్మెస్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu
M.S Raju about his super hit Okkadu film
హైదరాబాద్ : 'ఒక్కడు' చిత్రం మహేష్ కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఈ స్టార్ట్ అవ్వడం వెనుక కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయంటూ ఎంఎస్ రాజు చెప్పుకొచ్చారు. అవేంటంటే... 2001 సంక్రాంతి పోటీలో నా 'దేవీపుత్రుడు'తో పాటు నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు కూడా నిలిచాయి. ఆ పోటీలో నేనెంతో కష్టపడి తీసిన 'దేవీపుత్రుడు' ఫ్లాప్ అయినప్పుడు నేను ఆర్థికంగా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీఇన్నీ కావు. అదే టైమ్‌లో విడుదలైన 'మృగరాజు'ది కూడా సేమ్ సిట్యుయేషన్. అందుకే, నాకెందుకో దేవీవరప్రసాద్‌గారిని ఒక్కసారి కలవాలనిపించి ఆయన ఇంటికెళ్లాను. 'మృగరాజు' డెరైక్టర్ అయిన గుణశేఖర్‌తో కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ఆయనతో కలిసి సినిమా చేయాలని కూడా అప్పుడు నాకు లేదు. మాటల్లో మాట ఆయన వెంకటేష్‌గారితో 'లవకుశ' లాంటిదేదో తీస్తే బావుంటుందని చెప్పాడు. అయితే.. దాని గురించి నేను సీరియస్‌గా ఆలోచించలేదు. అప్పటికి ఆ టాపిక్ ముగిసింది అంటూ ఎం.ఎస్ రాజు తన గతాన్ని సాక్షి పేపరుకి ఇచ్చిన ఇంటర్వూలో గుర్తు చేసుకున్నారు.

అలాంటి టైమ్‌లోనే 'మురారి' సినిమా విడుదలైంది. నాకు సినిమా తెగ నచ్చేసింది. ఆ విషయమే కృష్ణగారికి చెప్పాను. మహేష్‌తో ఓ సినిమా చేయాలని ఉందని ఆయనతో అన్నాను. మాటల్లో మాట దివిసీమ నేపథ్యంలో ఓ ప్రేమకథ చేస్తే బావుంటుందని కృష్ణగారితో చెప్పాను. ఆయన కూడా బావుంటుందన్నారు. మహేష్‌తో కూడా ఆ టైమ్‌లో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. 'మనసంతా నువ్వే' కథ కూడా మహేష్‌కి చెప్పాను. కానీ ఆయన పెద్ద ఇంట్రస్ట్ చూపలేదు. అదే టైమ్‌లో మహేష్‌కి గుణశేఖర్ ఓ కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని, కథానుగుణంగా ఓ భారీ సెట్‌ని నిర్మించాలని, దాంతో ఆ సినిమాను హ్యాండిల్ చేయడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. సరిగ్గా అప్పుడే గుణశేఖర్ ఫోన్ చేసి, 'నేను మహేష్‌బాబు దగ్గర ఉన్నాను.. ఓసారి వస్తారా.. మాట్లాడాలి' అన్నాడు. సరేనని వెళ్లాను. 'ముగ్గురం కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దాం' అన్నాడు గుణశేఖర్. అదే 'ఒక్కడు'.

'మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి రాజుగారూ... చేద్దాం' అన్నాడు మహేష్. 'ఫుల్ ఎఫెర్ట్ పెట్టడం అంటే... ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదు. ఈ సినిమా నేను హ్యాండిల్ చేసేదీ... చేయందీ నా 'మనసంతా నువ్వే' విజయంపైనే ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయితే.. వచ్చిన డబ్బంతా మీ సినిమాకు పెడతాను. హిట్ కాకపోతే.. మాత్రం మీ సినిమాను నేను హ్యాడిల్ చేయలేను' అని మహేష్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. కానీ మహేష్ మాత్రం ససేమిరా అన్నాడు. 'మనసంతా నువ్వే' హిట్ అయినా... అవ్వకపోయినా 'ఒక్కడు' మీరే తీయాలి' అని పట్టుపట్టాడు. 'చార్మినార్ సెట్ వేయడమే ఆ సినిమాకు భారం అనుకుంటే... ఆ సెట్టే వేయొద్దు. అవసరం అనుకుంటే... రియల్ చార్మినార్ దగ్గరే షూటింగ్ చేద్దాం. అప్పుడు బడ్జెట్ కూడా తగ్గిపోతుంది' అన్నాడు. నేను అన్యమనస్కంగానే అంగీకరించాను.

లక్కీగా 'మనసంతా నువ్వే' భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బు మొత్తం 'ఒక్కడు'కి పెట్టేశాను. ప్రేక్షకులను అబ్బుర పరిచే రేంజ్‌లో చార్మినార్ సెట్ వేయించాను. నిర్మాతకు కేరక్టర్ ఎంత ముఖ్యమో... డబ్బు కూడా అంతే ముఖ్యమని, ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించాలంటే... నిర్మాతకు వెనుక ఓ విజయం ఉండాలని 'మనసంతా నువ్వే' విజయంతో నాకు తెలిసొచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోతే.. 'ఒక్కడు' తీయగలిగేవాణ్ణి కాదు. 'ఒక్కడు'తో మా తలరాతలే మారిపోయాయి. 'నీ స్నేహం' చిత్రానికి కొంత మేర నష్టం వాటిల్లితే... 'ఒక్కడు' దాన్ని పూడ్చేసింది. అంత పెద్ద విజయాన్ని మహేష్‌తో తీసిన నేను, మళ్లీ ఆయనతో సినిమా చేయకపోవడమేమిటనేది ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్న అన్నారు ఎంఎస్ రాజు.

English summary
MS Raju, the producer of films like Okkadu, Varsham and Nuvvu Vasthanante Nenu Vaddhantana, is making preparations for his next directorial venture these days. Okkadu is a 2003 Telugu melodrama film directed by Gunasekhar. It stars Mahesh Babu, Bhoomika Chawla, and Prakash Raj. Music was composed by Mani Sharma and editing was helmed by A. Sreekar Prasad. M.S. Raju produced this film. The film has garnered eight Nandi Awards and fiveFilmfare Awards South This movie was later remade into the Tamil as Ghilli and became a blockbuster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu