twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబుకు అంగవైకల్యం... శివాజీరాజా నోటి దురుసుపై మండిపడ్డ నరేష్

    |

    Recommended Video

    MAA President Naresh Condemns Sivaji Raja Comments On Nagababu || Filmibeat Telugu

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుల మధ్య చోటుచేసుకొన్న విభేదాలకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. తన ఓటమికి కారణమనే అక్కసుతో నటుడు నాగబాబుపై శివాజీ రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి జీవిత సోషల్ మీడియాలో ద్వారా స్పందించారు. మా అధ్యక్షులుగా పనిచేసిన వారు తమ ప్రతిష్టను దిగజార్చుకొనేలా పరుష పదజాలాన్ని వాడకూడదు అని నరేష్ అన్నారు. శివాజీరాజా చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ నరేష్, జీవిత ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

    నాగబాబు వర్సెస్ శివాజీరాజా

    నాగబాబు వర్సెస్ శివాజీరాజా

    మా ఎన్నికల సందర్బంగా నరేష్ ప్యానెల్‌కు మెగా బ్రదర్ నాగబాబు బహిరంగ మద్దతు ప్రకటించారు. దాంతో శివాజీ రాజా ప్యానెల్ ఓటమిపాలైంది. ఆ తర్వాత నాగబాబును పలుమార్లు మీడియా సమావేశంలో దూషించాడు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ రాజా హెచ్చరించారు. తాజాగా నాగబాబు అంగవైకల్యంతో బాధపడుతున్నారని కామెంట్ చేయడం గమనార్హం.

    శివాజీరాజా వ్యాఖ్యలను తప్పుపట్టిన నరేష్

    శివాజీరాజా వ్యాఖ్యలను తప్పుపట్టిన నరేష్

    నటుడు నాగబాబుపై మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ తప్పుపట్టారు. నేను మా అధ్యక్షుడిగా నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు సినీ నటుడిగానే నా అభిప్రాయం చెబుతున్నానని అన్నారు. నాగబాబుపై శివాజీ రాజా గురించి అలా మాట్లాడటం మనసుకు బాధవేసింది అని నరేష్ అన్నారు.

     వ్యక్తిగతంగా దూషించొద్దు

    వ్యక్తిగతంగా దూషించొద్దు

    మా అధ్యక్షుడిగా నాగబాబు తన వంతు సేవలను అందించారు. ఓ సంస్థను నడిపేటప్పుడు కొన్ని తప్పు, ఒప్పులు జరుగుతాయి. అంత మాత్రాన ఒకరిని వ్యక్తిగతంగా దూషించవద్దని తెలియజేయాలనుకొంటున్నాను. మీడియా సమావేశం పెట్టి వివాదం చేయవద్దని అనుకొంటున్నాం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలు చేయవద్దని సూచించాలనుకొంటున్నాం అని నరేష్ అన్నారు.

    నాగబాబు ప్రతిష్టను దెబ్బతీయడమేనని

    నాగబాబు ప్రతిష్టను దెబ్బతీయడమేనని

    అంగవైకల్యంతో బాధపడుతున్నాడని నాగబాబును ఉద్దేశించి నటుడు శివాజీ రాజా వ్యాఖ్యలు చేయడం సరికాదు. అంగవైకల్యం అని మాట్లాడటం ఓ నటుడి ప్రతిష్టను దెబ్బ తీయడమే. ఆయన చక్కగా నడుస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. అలాంటి నాగబాబు తన హాయంలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించడం తప్పు. నాగబాబు హయాంలో పెన్షన్లను ప్రారంభించారు. దాదాపు 600 మంది సభ్యులకు తనవంతు సహాయాన్ని చేశారు అని నరేష్ చెప్పారు.

    పబ్లిక్‌గా విమర్శలు వద్దు

    పబ్లిక్‌గా విమర్శలు వద్దు

    మా అధ్యక్షుడిగా పనిచేసిన నటుడిని పట్టుకొని పబ్లిక్‌గా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. నాగబాబు పిల్లికి బిచ్చం పెట్టడని ఆయన దూషించడం సరికాదు. నాగబాబు లేకపోతే శివాజీ రాజా గెలిచే వాడా? రాజకీయాల్లో ఎవరు ఎవరినైనా విమర్శించ వచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు చేయవద్దు. మా సంస్థను బజారుకీడ్చవద్దు. శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని నరేష్ అన్నారు.

    మార్పు కోసం పనిచేద్దామని పిలుపు

    మా ఎన్నికల్లో మార్పును కోరుతూ సభ్యులు నూతన కార్యవర్గానికి అధికారం కట్టబెట్టారు. రెండేళ్ల పదవీకాలంలో మంచి పనులు చేయడానికి సహాయం అందించాలి. పెన్షన్లు, ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలనుకొంటున్నాం. మా అనేది కుటుంబం.. ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడు కోవాలని నేను సూచిస్తున్నాను అని నరేష్ అన్నారు.

    English summary
    Movie Artists Association (MAA) President VK Naresh condemns Sivaji Raja comments on Nagababu. He said MAA is a social organisation and me along with the new team were given opportunity for two years to serve better in a healthy atmosphere. Member should not target personal lifes of any Actors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X