twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Election results: తెలుగు బిడ్డ గెలిచాడు.. ప్రకాశ్ రాజ్, నరకం అనుభవించా.. ఇక జీవితంలో అంటూ మంచు విష్ణు

    |

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు వివాదాస్పద అంశాల మధ్య జరిగినప్పటికీ.. ముగింపు మాత్రం సహృద వాతావరణంతో ముగిసాయి. మంచు విష్ణు విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి ప్రకటించగానే ప్రకాశ్ రాజ్ హుందాగా తన ఓటమిని స్వీకరించారు. ఎన్నికల అధికారి అధికారిక ప్రకటన తర్వాత ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఒకే వేదిక మీద నుంచి తొలి ప్రసంగం చేశారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

    హుందాగా ఓటమిని స్వీకరించిన ప్రకాశ్ రాజ్

    హుందాగా ఓటమిని స్వీకరించిన ప్రకాశ్ రాజ్

    ప్రకాశ్ రాజ్ తన ఓటమిని హుందాగా స్వీకరించారు. మంచు విష్ణు, తన ప్యానెల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. వేదిక మీద నవ్వుతూ తన ఓటమిని హుందాగా స్వీకరించారు. ఎలాంటి భావోద్వేగం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. గెలుపు ఓటములు సాధారణం అనే విధంగా పరిణతిని ప్రదర్శించారు.

    మంచు విష్ణుకు శుభం జరగాలి..

    మంచు విష్ణుకు శుభం జరగాలి..

    గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు భారీగా జరిగాయి. 650 మందికిపైగా ఓటు వేశారు. ఓ తెలుగు బిడ్డను ఎన్నుకొన్నారు. ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాను. మంచు విష్ణుకు అంతా శుభం జరగాలి అంటూ ప్రకాశ్ రాజ్ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతుండగా విష్ణు మంచు తలవంచుకొని ఎమోషనల్ అయ్యారు.

    విష్ణు మంచు కంటతడి

    విష్ణు మంచు కంటతడి

    ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తర్వాత విష్ణు మంచును మాట్లాడమని కోరగా ఆయన కంటతడి పెట్టుకొంటూ కనిపించారు. కాసేపు ఆగిన తర్వాత ప్రకాశ్ రాజ్‌ను గాఢంగా కౌగిలించుకొన్నారు. దాంతో ఆయనను ప్రకాశ్ రాజ్ వెన్నుతట్టి ఓదార్చారు. మంచు విష్ణు గెలిచాడని ప్రకటించగానే ఆయన ప్యానెల్ సభ్యులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మోహన్ బాబు వచ్చి ప్రకాశ్ రాజ్‌ను కౌగిలించుకొన్నారు.

     ఈ గెలుపు నాన్నగారిది

    ఈ గెలుపు నాన్నగారిది

    అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈ గెలుపు మా నాన్న గారిది. అందరం ఒకే కుటుంబం. మేమందరం ఒకే కుటుంబం. ఇంత దూరం వచ్చి ఉండకూడదు. ప్రకాశ్ రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓటర్లందరికి నా ధన్యవాదాలు. నా గెలుపు కోసం కృషి చేసిన నరేష్ అంకుల్‌కు థ్యాంక్స్ అంటూ మంచు విష్ణు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

    రెండు నెలలు నరకం అనుభవించా

    రెండు నెలలు నరకం అనుభవించా

    మా ఎన్నికల నేపథ్యంలో గత రెండు నెలలుగా నేను నరకం అనుభవించాను. చాలా మాటలు అనుకొన్నాం. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకొన్నాం. ఇక జన్మలో మా ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం కనిపించకూడదు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. గెలిచిన వారు.. ఓటమి చెందిన వారు కూడా అంతా ఒకటే.. మమంతా కలిసి పనిచేస్తాం. ప్రతీ నటుడి ఆత్మగౌరవానికి సంబంధించిన గెలుపు ఇది అంటూ విష్ణు మంచు అన్నారు.

    Recommended Video

    MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
    మా ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..

    మా ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..

    మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 270 ఓట్లు లభించాయి. ఇక ప్రధాన కార్యదర్శి పదవికి పోటి చేసిన రఘుబాబు విజయం సాధించారు. ఆయనకు 340 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి జీవితకు 313 ఓట్లు పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ పోస్టుకు పోటీ చేసిన శ్రీకాంత్ విజయం సాధించారు. శ్రీకాంత్‌కు 375 ఓట్లు రాగా, బాబు మోహన్‌కు 269 ఓట్లు లభించాయి. ఇక కోశాధికారి పదవికి పోటీ చేసిన శివ బాలాజీకి 359 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి నాగినీడుకు 292 ఓట్లు పోలయ్యాయి.

    English summary
    MAA Elections 2021: Vishnu Manchu elected as MAA President. Prakash lost with 111 Votes. In this occassion, Prakash Raj congratulated the Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X