»   » కబాలీలో కరీంనగర్ పుస్తకం అంటూ కలకలం... నిజమేనా..?

కబాలీలో కరీంనగర్ పుస్తకం అంటూ కలకలం... నిజమేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమాజపు అట్టడుగునుంచీ బయల్దేరి ఉన్నత స్థాయికి చేరుకోడానికి ఒక తెలంగాణా దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని విశదంగా కళ్లముందుకు తెచ్చిన జీవిత చరిత్ర ఇది. ఆర్థిక సామాజిక ఆంక్షలనూ, అడ్డంకులనూ వీరోచితంగా ఎదుర్కొని విజయంసాధించిన కుటుంబ చరిత్ర గా తన తండ్రి కాలం నాటి సామాజిక ఒపరిస్ఠితులనూ... ఆయన నే మూలంగా చేసుకొని వై.బీ. సత్యనారాయణ రాసిన మా నాయిన బాలయ్య (మై ఫాదర్ బాలయ్య) పుస్తకం. లేటేస్త్ క్రేజ్ కబాలి సినిమాలో కనిపించిందంటూ వచ్చిన వార్త నిజమా కాదా అన్న సంధిగ్దత ఇంకా వీడ లేదు కానీ . హీరో రజినీకాంత్ జైల్లో ఈ పుస్తకం ఇంగ్లిష్ వెర్స్ఘన్ ని చదువుతున్నట్టుగా ట్రైలర్ లో కనిపించటం తో పలువురు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వై.బి. సత్యనారాయణ అనే రిటైరయిన కాలేజీ ప్రిన్సిపల్ తన దళిత కుటుంబ చరిత్రని తన ముత్తాత దగ్గర్నుంచీ మొదలుపెట్టి చెప్పుకుంటూ వస్తారు. ముత్తాత నర్సయ్య, తాతయ్య నర్సయ్య, తర్వాత తండ్రి బాలయ్య, తర్వాత రచయిత (సత్తయ్య/ సత్యనారాయణ) ఇలా నాలుగు తరాల చరిత్ర ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయబడింది. ఈ పుస్తకానికి కథానాయకుడు పుస్తకం పేరు చెప్తున్నట్టూగానే రచయిత తండ్రి యెలుకటి బాలయ్య..


Maa Nayina Balaiah book in kabali

రెండు శతాబ్దాలకు విస్తరించిన ఈ మూడు తరాల కధ కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటే మనిషి జీవితం ఇంత పర పీడనమా అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే ఈ కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న నిజం డాక్టర్ సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం చదివినవారికి బోధపడడం తధ్యం.


ఇపుడీ పుస్తకం కబాలీ లో కనిపించిందీ అంటే ఇతర రష్ట్రాలలోనూ ఈ దళిత చరిత్రకి ఉన్న ఆదరణా ప్రతీ మనిషి మనసులోకి చొచ్చుకు పోయి దళిత సమస్యల ని అర్థం చేయించాలన్న రచయిత ఉద్దెశమూ నెరవేరిందనే అనుకోవచ్చు... సినిమాలో కనిపించటం గొప్ప కాక పోవచ్చుగానీ... వేరే భాషలోనూ ఒక రచయిత రాసిన పుస్తకం అందునా... ఈ దేశం లో అడుగడుగునా కనబడే వివక్షకి మూలాలని వెతికే దారిని చూపే ఒక పుస్తకం అలా కనిపించినప్పుడు కాస్త ఆనందమే కదా మరి...

English summary
The Book "My Father Balaiah" which is Translated to English from Telugu "Ma nayina Balaiah" Written by YB satyanaarayana From Karim Nagar District of Telangana state is Appears in Rajini kanth's Latest Movie "Kabali"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu