For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ ఫ్రోగ్రాం గొడవ: బురద జల్లడం బాధేసింది, అందుకే వదిలేశామన్న శివాజీ రాజా!

  |

  మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో కొన్ని రోజుల క్రితం పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్షుడిగా శివాజీ రాజా కొనసాగుతుండగా.... అసోసియేషన్లో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీయర్ నరేష్, మరికొందరు ఆందోళన చేపట్టడం, విషయం మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వరకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలు కల్పించుకుని గొడవ సద్దుమనిగేలా చేయడంతో పాటు... ఇరు వర్గాలను శాంత పరిచారు. అసోసియేషన్లో ఆధిపత్య పోరు ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివాజీ రాజాకు ఆ గొడవకు సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా రియాక్ట్ అయ్యారు.

   బురద చల్లడం బాధ అనిపించింది

  బురద చల్లడం బాధ అనిపించింది

  ఫారిన్ కంట్రీలో మహేష్ బాబు ఫ్రోగ్రాం కన్ఫార్మ్ అయిందని అప్పట్లో అన్నారు. అది ఎందుకు ముందుకు వెళ్లలేదు? అనే ప్రశ్నకు శివాజీ రాజా స్పందిస్తూ.... మహేష్ గారు, నమ్రతగారు గ్రేట్. ప్రోగ్రాం గురించి వారి వద్దకు వెళ్లానే ఒప్పుకున్నారు. చిరంజీవి గారితో చేశాం. మహేష్ బాబుగారితో కూడా గొప్పగా ప్రోగ్రాం చేయాలనుకున్నాం. అయితే ఒక్కసారిగా మా మీద బురద చల్లేసరికి చాలా బాధ అనిపించింది.

   అన్యాయం అయిపోయేది వారే

  అన్యాయం అయిపోయేది వారే

  వారు బురద చల్లడం వల్ల మేము సెల్‌లోకి వెళ్లితే అన్యాయం అయిపోయేది ఎవరు? నాకు తినడానికి లోటు లేదు, శ్రీకాంత్ గారికి లేదు. బురద చల్లిన వారికి అసలు లేదు. ఇబ్బంది పడేది లేని వారు. ఎవరికోసం అయితే చేయాలనుకున్నామో వారు ఇబ్బంది పడతారు.

   ఇలాంటి గొడవలు ప్రతి చోటా ఉంటాయి

  ఇలాంటి గొడవలు ప్రతి చోటా ఉంటాయి

  నరేష్ గారే ఆ ఫ్రోగ్రాం ఆపారనేది రూమర్ అని మీరే అంటున్నారు. అలాగే అనుకోండి. ఇంకోసారి మహేష్ బాబు గారిని తీసుకెళతాం. ప్రతి అసోసియేషన్లోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇగో ప్రాబ్లమ్స్ కావచ్చు, నా తప్పు కావచ్చు, వాళ్ల తప్పు కావచ్చు, మిస్ అండర్ స్టాండింగ్స్ అయుండొచ్చు. నా ఎక్స్ పీరియన్స్‌లో ఒకటి కరెక్ట్ అనుకుంటాను. వాళ్లేమో ఎక్స్‌పీరియన్స్ లేకుండా వీరికి పేరొస్తుంది అనుకోవచ్చు. ఇవన్నీ మామలే అని శివాజీ రాజా తెలిపారు.

  నిధులు దారి మళ్లలేదని మళ్లీ వారే చెప్పారు

  నిధులు దారి మళ్లలేదని మళ్లీ వారే చెప్పారు

  నిధులు దారి మళ్లాయని నరేష్ గారు, మరికొందరు గొడవ చేశారు? కదా అనే ప్రశ్నకు శివాజీ రాజా స్పందిస్తూ.... మళ్లలేదని మళ్లీ వారే చెప్పారు. అందరూ ఒకలా ఎలా ఉంటారు? కొంత మందికి ఈగోస్ ఉంటాయి. ఈడికి పేరొస్తుంది, శ్రీకాంత్ గారికి పేరొస్తుందనే ఇది ఉంటుంది.

  ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో ఉంటారు

  ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో ఉంటారు

  ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినపుడు నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా... ఆ వయసులో కూడా పరుచూరి వెంకటేశ్వరరావుగారు, 125 సినిమాల హీరో శ్రీకాంత్,. బెనర్జీ, ఏడిద శ్రీరాం, అనితా చౌదరి, హేమ, నాగినీడు ఎవ్వరూ ఫీలవ్వకుండా ఐదు నిమిషాల్లో నా ముందుంటారు.

  వాళ్ల మదర్ ను చూసి వదిలేశాం

  వాళ్ల మదర్ ను చూసి వదిలేశాం

  ఇక్కడైనా ఇలాంటి చిన్న చిన్నవి వస్తుంటాయి. వచ్చినపుడు బాధ అనిపిస్తుంది. వాళ్ల కర్మకు వాళ్లే పోతారు... 32 ఏళ్ల నుంచి ఉంటున్నాం. నేనేంటో, శ్రీకాంత్ ఏమిటో ఇండస్ట్రీలో తెలియదా? రాజకీయాల్లో బురద చల్లితే ఫర్వాలేదు. రాజకీయాల నుంచి వచ్చారు కదా, ఆ అలవాటు ఉంటుంది. వాళ్ల మదర్ ను చూసి వదిలేశాం... అని శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

  English summary
  Maa President Sivaji Raja about Mahesh babu MAA program issue. Sivaji Raja is a Telugu comedian and actor. Sivaji Raja appeared in more than 400 films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X