twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు-మహేష్‌లతో అమెరికాలో భారీ ఈవెంట్...తోకాడిస్తే కత్తిరిస్తామని హీరోయిన్లకు ‘మా’ హెచ్చరిక!

    By Bojja Kumar
    |

    Recommended Video

    'MAA' Warning to Top Actresses

    మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ‌వైభంగా క‌ర్టైన్ రైజ‌ర్ వేడుక జ‌రిగింది. తాజాగా మా విదేశాల్లో సెల‌బ్రేట్ చేసేందుకు కూడా ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికా డ‌ల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది.

    ముఖ్య అతిథులుగా చిరంజీవి, మహేష్ బాబు

    ముఖ్య అతిథులుగా చిరంజీవి, మహేష్ బాబు

    అమెరికాలో జరిగే ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్న‌ట్లు `మా` అధ్యక్షుడు శివాజీ రాజా సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలిపారు. ఈవెంట్‌ను ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్- తిరుమ‌ల ప్రొడ‌క్ష‌క‌న్స్ ప్రైవెట్ లిమిటెడ్ సంయుక్త‌గా అమెరికాలో నిర్వ‌హిస్తున్నాయి.

    బాల్యయ్య, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ సపోర్టు

    బాల్యయ్య, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ సపోర్టు

    శివాజీ రాజా మాట్లాడుతూ, `చిరంజీవిగారికి `మా` వేడుక‌లు గురించి చెప్ప‌గానే వెంట‌నే ఒప్పు కున్నారు. ఎక్క‌డికి రావడానికైనా సిద్దంగా ఉన్నాన‌ని హామీ ఇచ్చారు. అలాగే మ‌హేష్ బాబు గారు కూడా మేలో జ‌రిగే ఓ ఈవెంట్‌కు వ‌స్తాన‌న్నారు. వీరిద్ద‌రూ మాకు ఎంతో స‌హాకారాన్ని అందిస్తున్నారు. అలాగే బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, వెంక‌టేష్, నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. `మా` కోసం ఎత‌క‌ష్ట‌మైనా ప‌డ‌టానికి నేను..మాటీమ్ సిద్దంగా ఉన్నాం.... అన్నారు.

    పర భాషా హీరోయిన్లకు హెచ్చరిక

    పర భాషా హీరోయిన్లకు హెచ్చరిక

    అలాగే ప‌ర‌భాషా హీరోయిన్లు అయినా...మ‌న తెలుగు హీరోయిన్లు అయినా స‌రే క‌చ్చితంగా `మా` లో మెంబ‌ర్ షిప్ తీసుకోవాలి. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందంటే `మా` ముంద‌కు వ‌స్తున్నారు గానీ, అప్ప‌టివ‌ర‌కూ మేము గుర్తు రావ‌డం లేదు. ఆ స‌మ‌యంలో ఒక చేత్తో `మా` మెంబ‌ర్ షిప్ ఫార‌మ్...మ‌రో చెత్తో కంప్లైట్ ఫార‌మ్ తీసుకుని వ‌స్తున్నారు. ప‌రిస్థితి అంత‌వ‌ర‌కూ తెచ్చుకోవ‌ద్ద‌ని కోరుకుంటున్నాం... అని శివాజీరాజా తెలిపారు.

    కోట్లు తీసుకుంటున్నారు, తోకాడిస్తే తోకలు కట్ చేస్తాం

    కోట్లు తీసుకుంటున్నారు, తోకాడిస్తే తోకలు కట్ చేస్తాం

    ఇతర రాష్ట్రాల హీరోయిన్లు మా రాష్ట్రానికి వచ్చి కోట్లు కోట్లు తీసుకుంటున్నారు. వారు ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సహకరించడం లేదో అర్థం కావడం లేదు. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ బ్రతిమిలాడుతూనే ఉన్నాం. ఇద్దరు ముగ్గురు కోఆపరేట్ చేస్తున్నారు, కొందరు మేనేజర్ల మీద తోసేస్తున్నారు. మేము చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్నాం. చాలా మంది హీరోయిన్లను చూశాం. పరిస్థితి సీరియస్‌గా పేర్లు చెప్పే వరకు తీసుకురాకండి. మీరు అమెరికాలో ‘మా’ నిర్వహించే ఈవెంటుకు రావాల్సిందే. మేము మిమ్మల్ని డబ్బులు అడగటం లేదు. మీకు ఇస్తామంటున్నాం. మీరు అడిగినంత ఇవ్వక పోవచ్చు. ఎంతో కొంత ఇస్తాం. మీరు సహకరించాలి. అలా కాదని తోకాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాం.... అంటూ ‘మా' అధ్యక్షుడు శివాజీ రాజా హెచ్చరించారు.

    చిరంజీవి గారు వ‌స్తే ఫండ్ ఇస్తామ‌న్నారు

    చిరంజీవి గారు వ‌స్తే ఫండ్ ఇస్తామ‌న్నారు

    ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ` మా ఫండ్ రెయిజింగ్ కోసం ఆర్గనైజ‌ర్ల‌ను క‌లిస్తే చిరంజీవి గారు వ‌స్తే ఫండ్ ఇస్తామ‌న్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెప్ప‌గానే ఆయ‌న వెంట‌నే ఒప్పుకున్నారు. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో అంతా క‌లిసి క‌ట్టుగా ఉండి ఏపనైనా చేస్తారు. వాళ్ల అసోసియేష‌న్ ఆఫీస్‌లు చాలా బాగుంటాయి. కానీ మ‌నకు స‌రైన బిల్డింగ్ కూడా లేదు. అలాంటివ‌న్నీ మ‌నం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిల్వ‌ర్ జూబ్లీ వేడుకలకు అంద‌రు స‌హ‌కరిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

    జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ

    జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ

    జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, ` చిరంజీవిగారు, మ‌హేష్ బాబు గారు `మా` జ‌రిపే కార్య‌క్ర‌మాల‌కు పూర్తిగా స‌హ‌కారం అందిస్తున్నందు చాలా సంతోషంగా ఉంది. అలాగే క‌ర్ణాట‌క ఫిలిం ఇండ‌స్ట్రీ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్స‌వం నిన్న జ‌రిగింది. ఆ కార్య‌క్ర‌మానికి చిరంజీవి గారు, నేను కూడా వెళ్లాం. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇలాంటి బిల్డింగ్ మ‌నం కూడా ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ఆయ‌న అన్న‌ట్లు అది వీలైనంత త్వ‌ర‌లోనే జ‌రుగుతుంది. అలాగే హీరోయిన్లు అంద‌రూ కూడా మెంబ‌ర్ షిప్ తీసుకోవాలి. `మా` జ‌రిపే కార్య‌క్ర‌మాల‌కు కూడా స‌హ‌కారం అందించాలి. ఇప్ప‌టికే కొంత మంది స‌హ‌కార‌మందిస్తామ‌ని మాటిచ్చారు. ఇటీవ‌లే 80 మంది కొత్త‌గా మెంబ‌ర్ షిప్ తీసుకున్నారు` అని అన్నారు.

    అమెరికా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఈవెంట్

    అమెరికా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఈవెంట్

    స్టీఫెన్ ప‌ల్లామ్ (అమెరికా) మాట్లాడుతూ, ` అమెరికా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఈవెంట్ చేస్తున్నాం. దాదాపు 8000 నుండి10,000 సామార్ధ్యం గ‌ల ఆడిటోరియంలో ఈవెంట్ జ‌ర‌గ‌నుంది` అని తెలిపారు.

    భ‌విష్య‌త్ లో కూడా ఇలాంటి కార్య‌క్ర‌మం మరొక‌టి జ‌ర‌గ‌దేమో! అన్న స్థాయిలో

    భ‌విష్య‌త్ లో కూడా ఇలాంటి కార్య‌క్ర‌మం మరొక‌టి జ‌ర‌గ‌దేమో! అన్న స్థాయిలో

    రాంబాబు క‌ల్లూరి (అమెరికా) మాట్లాడుతూ, ` సెల‌బ్రిటీల‌ను తెర‌పై చూసే బోలెడంత సంబ‌ర‌ప‌డిపోతాం. అలాంటిది ఒకే వేదిక‌పై స్టార్స్ ని అంద‌రినీ లైవ్ లో చూపించ‌బోతున్నాం. గ‌తంలో అమెరికా చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఇలాంటి కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు. భ‌విష్య‌త్ లో కూడా ఇలాంటి కార్య‌క్ర‌మం మరొక‌టి జ‌ర‌గ‌దేమో! అన్న స్థాయిలో చేయ‌బోతున్నాం` అని అన్నారు.

    English summary
    MAA President Sivaji Raja Fires On Tollywood Actresses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X