»   »  ఎన్టీఆర్ సినిమాకు నాలుగు కోట్లు...

ఎన్టీఆర్ సినిమాకు నాలుగు కోట్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
ఛానెల్స్ పెర్గటంతో వాటి మధ్యన పోటీ పెరిగిపోయింది.దాంతో పెద్ద సినిమాలు ప్రారంభం రోజునే రైట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇక నిన్న(శుక్రవారం) ప్రారంభమయిన ఎన్టీఆర్ వినాయిక్ సినిమాకు శాటిలైట్ రైట్స్ అప్పుడే అమ్ముడయ్యాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మా టీవీ వారు దాదాపు నాలుగు కోట్లు చెల్లించి ఈ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇక ఈ ఛానెల్ వారే రవితేజ...పూరీ కాంబినేషన్ నేనింతే సినిమాను తీసుకున్నారు. ఇక ఈ పెద్ద సినిమాలు తీసుకుంటే వాటి ప్రదర్శన వేళల్లో టీ ఆర్ పీ రేటింగ్స్ పెంచుకోవటమే కాక ముక్క ముక్కలుగా చేసి రకరకాల ఫిల్మ్ బేస్డ్ పోగ్రామ్స్ కి వినియోగించుకోవచ్చునని ఆశిస్తూంటారు. ఇక రాబోయే కొన్ని పెద్ద సినిమాలకు కూడా భారీ స్ధాయిలో పోటీ ఉంటుందని తెలుగు సినీ పరిశ్రమ భావిస్తోంది. ఈ రకంగా హై రేంజిలో రైట్స్ కి పెద్ద మొత్తాలు రావటంతో ఆ రేంజిలోనే హీరోలు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిన నిజం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X