twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతదేశంలో ఆ పరిస్థితి ఇంకెంతో దూరం లేదు.. నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

    |

    దేశవ్యాప్తంగా జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ)ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. అయితే దీని అమలుపై ప్రస్తుతం దేశమంతా తీవ్ర దుమారం రేగుతోంది. దీనిని బీజేపీ వర్గాలు సమర్థిస్తుంటే మిగిలిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినీ నటి, బీజేపీ నాయకురాలు ఈ ఇష్యూపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి పోతే..

    సోషల్ మీడియాలో పోస్ట్.. సెన్సేషనల్ కామెంట్స్

    సోషల్ మీడియాలో పోస్ట్.. సెన్సేషనల్ కామెంట్స్

    ఎన్‌ఆర్సీపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ చేసింది మాధవీలత. తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సిరియా నుంచి బెల్జియంకు వలస వచ్చిన ముస్లింలు ఇప్పుడు ఆ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. భారత్‌కు కూడా ఇతర దేశాల నుంచి ముస్లింలు భారీ ఎత్తున వలస వస్తే మైనారిటీలు ఇక్కడ మెజారిటీలుగా మారిపోతారని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

    దశాబ్ద కాలంగా సెక్యులర్ ఆలోచనలతో..

    దశాబ్ద కాలంగా సెక్యులర్ ఆలోచనలతో..

    మాధవీలత చేసిన పోస్ట్‌లో.. ''ఇప్పటికే యావత్ ప్రపంచంలో ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలుగా రూపాంతరం చెందిన విషయం అందరికి తెలిసిందే. అంటే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలు 67 ఉండగా, ఇప్పుడు ఇంక్కొన్ని కావాలని ఇస్లాం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈజిప్టు ఇప్పటికే ముస్లిమ్స్ లా అనుసరిస్తుండగా, బెల్జియం ప్రజలు గత దశాబ్ద కాలంగా సెక్యులర్ ఆలోచనలతో.. సిరియా నుండి వలసగా వచ్చిన ముస్లిం ప్రజలకు ఆశ్రయం ఇవ్వడంతో ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వచ్చింది'' అని పేర్కొంది.

    దొరికిందే అవకాశం అన్నట్టు..

    దొరికిందే అవకాశం అన్నట్టు..

    ''అనుకోని పరిస్థితుల్లో బెల్జియం ప్రజలు తమ అనుకూల ప్రతికూల నాయకులపై విశ్వాసం కోల్పోయి మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లిమ్ వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించడంతో, ఇప్పుడు బెల్జియంలో ముస్లిమ్ నాయకులు పట్టు బిగించారు. ఇంకేం ఉంటుంది.. దొరికిందే అవకాశం అన్నట్టు ముస్లిమ్ ప్రజలు ధర్నాలు చేయడం ప్రారంబించారు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవీలత.

    ప్రజలు పులిహారలో కరివేపాకులా..

    ప్రజలు పులిహారలో కరివేపాకులా..

    ''బెల్జియంలో ఇప్పుడు షరియా కోసం బెల్జియం.com అంటూ ముస్లిమ్ వర్గీయులు ఈ ఉద్యమాన్ని భారీ స్థాయిలో తీసుకొని వెళ్తున్నారు. దీనిపై ఊరు, వాడ ప్రతి చోట ఈ ముస్లిమ్ వర్గీయులు తమ ఉద్యమాన్ని ప్రకటిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఒకవేళ ఇస్లామిక్ దేశంగా బెల్జియంని ప్రకటించకపోతే భవిష్యత్ లో జరగబోయే ప్రతి దాడికి ప్రభుత్వమే భాద్యత వహించాలి అంటూ బెల్జియం ముస్లిమ్ లీగల్ పార్టీకి హెచ్చరికలు జారీచేసింది. పాపం ఇంకేం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో బెల్జియం ప్రజలు పులిహారలో కరివేపాకులా మిగిలిపోయే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి'' అని మాధవీలత పేర్కొంది.

    భారత్‌లో ఉన్న సెక్యులర్ జీవులు మేల్కోవాలి

    భారత్‌లో ఉన్న సెక్యులర్ జీవులు మేల్కోవాలి

    ''ఇప్పటికైనా భారత్‌లో ఉన్న సెక్యులర్ జీవులు మేల్కోవాలని, ప్రపంచంలో హిందువుల కోసం ఒకే ఒక దేశం ఉంది. అది కేవలం భారతదేశం.గతంలో ప్రపంచమంతా హిందువులే ఉండే వారు. దురదృష్టవశాత్తూ ఈ సెక్యులర్ ఆలోచనల వల్ల అన్ని దేశాలను ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్ మతాలకు కట్టబెట్టటం జరిగింది. ఇప్పుడు ఉన్న ఏకైక దేశాన్ని కూడా హిందువుల దేశం కాదు సెక్యులర్ దేశం అంటూ మనకు మనమే మోసపోతున్నాం. మన ఇంటిలో ఒక ఇటుక స్థలం కూడా పక్కోడికి మనం ఇవ్వము అలాంటింది మన దేశాన్ని ఏ అధికారంతో అందరికి కట్టబెట్టుతున్నాం, ఒక సారి ఆలోచించండి'' అంటూ సంచలనం సృష్టించింది మాధవీలత.

    భారతదేశం కూడా బాగ్దాద్ కావడం ఇంకెంతో దూరం లేదు

    ''బెల్జియం దేశంలో ముస్లిమ్స్ పార్టీ మొదటి సారిగా గెలిచింది ఆ దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని ఉద్యమం చేపడుతున్నారు.
    రేపొద్దున్న మనం కూడా సెక్యులర్ అనే పేరుతో ముస్లిమ్స్ నాయకులకు మన రాజ్యాధికారం ఇస్తే , మన భారతదేశం కూడా బాగ్దాద్ అవ్వడం ఇంకెంతో దూరం లేదు'' అని తన పోస్ట్‌లో రాసింది మాధవీలత.

    English summary
    Actress Maadhavi Latha Comments On NRC. She posted a message on her facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X