తెలుగు హాస్య నటుడు ‘మాడా’ కు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్: తెలుగు హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 1950 అక్టోబర్ 10న జన్మించిన మాడా వెంకటేశ్వరరావు వయసు 65. ముత్యాల ముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రాలు మాడాకు మంచి గుర్తింపు తెచ్చాయి.

సినిమాల్లోకి రాకముందు విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. అదే సమయంలో పలు నాటకాల్లో కూడా నటించారు. 'ముత్యాలముగ్గు', 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' సినిమాలతో మాడాకు బాగా గుర్తింపు లభించింది. అనంతరకాలంలో అనేక సినిమాల్లో నటించిన ఆయన, 'చూడు పిన్నమ్మ పాడు పినమ్మ...' పాటతో బాగా పాప్యులర్ అయ్యారు.



Click it and Unblock the Notifications











