»   » కోటిన్నర ఇస్తే ఐశ్యర్యతో రొమాన్స్ చేస్తా.. హీరోకు షాకిచ్చిన దర్శకుడు

కోటిన్నర ఇస్తే ఐశ్యర్యతో రొమాన్స్ చేస్తా.. హీరోకు షాకిచ్చిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Madhavan Asked Huge Remuneration To Romance With Aishwarya Rai

సినిమాలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ తో రోమాన్స్ కు మీరు ఓకే నా అని దేశ విదేశీ చిత్ర పరిశ్రమలోని హీరోలను అడిగితే ఏమంటారు... ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేము ఓకే అంటారు. అలాంటిది మేము నిర్మిస్తున్న చిత్రంలో ఐష్ తో రోమాన్స్ కు మీరు ఓకే కదా అని ఓ దర్శకుడు ... విలక్షణ నటుడిని అడిగారు. ఆ హీరో గారు ఇచ్చిన సమాధానంతో ఆయన అవాక్కయ్యారు సదరు సినిమా నిర్మాత... దీంతో ఆమెతో రోమాన్స్ కు మరో హీరోను వెదుక్కున్నారు. ఆ నిర్మాత ఇంతకీ అసలు కథేంటంటే..

ఐశ్వర్యకు ప్రియుడిగా మాధవన్

ఐశ్వర్యకు ప్రియుడిగా మాధవన్

ఐశ్వర్యారాయ్, అనీల్ కపూర్ ప్రధాన తారాగణంతో ఫన్నీఖాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఐశ్వర్య కు ప్రియుడిగా ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ నటించమని చిత్ర దర్శకుడు అడిగారు. అయితే మాధవన్ గొంతెమ్మ కోరికలు విని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా నివ్వెర పోయారట.

కోటిన్నర డిమాండ్..

కోటిన్నర డిమాండ్..

వాస్తవానికి ఫన్నీ ఖాన్ చిత్రం కోస్ కేవలం 15 రోజుల షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ మాధవన్ కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ కావాలని దర్శకుడిని మాధవన్ డిమాండ్ చేశారు. కలలో కూడా అంత పారితోషకం అడుగుతాడని ఊహించని నిర్మాత ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అంతే అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.

కుర్ర హీరోలతో సంప్రదింపులు

కుర్ర హీరోలతో సంప్రదింపులు

సౌందర్య రాశి ఐశ్వర్య పక్కన నటించే ఛాన్స్ వస్తే చాలు అనుకునే వారిని చూశాడు. కానీ ఇలాంటి హీరోలు కూడా ఉంటారా అనే ప్రశ్న అతడి బుర్ర ను తొలిచేసింది. దీంతో ఐశ్వర్యతో రోమాన్స్ కు మరో హీరోని వెతికే పనిలో పడ్డారు. అక్షయ్ ఒబేరాయ్, కార్తీక్ ఆర్యన్ అనే కుర్ర హీరోలను పరిగణనలోకి తీసుకొన్నారు. కానీ ఏదో కారణాల వల్ల వారిని పక్కన పెట్టారు.

ఆదిల్ ఇబ్రహీంపై దృష్టి

ఆదిల్ ఇబ్రహీంపై దృష్టి

ఐష్ జోడి కోసం రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా మలయాళంలో హాట్ హీరో అయిన ఆదిల్ ఇబ్రహీంను తీసుకోవాలని భావించారట. కానీ ఐష్ నో చెప్పడం, నిర్మాతలు కూడా ఒప్పుకోకపోవడంతో ఆ ప్రతిపాదనను విరమించుకొన్నారు.

చివరకు రాజ్ కుమార్ రావు..

చివరకు రాజ్ కుమార్ రావు..

ఆమె పక్కన నటించే హీరోల కోసం వేట మొదలెట్టారు. అలా పలువురుని చూసి చివరకు ఐశ్వర్య పక్కన రోమాన్స్ కు రాజ్ కుమార్ రావును ఎంపిక చేశారు. దీనిపై హీరో మాధవన్ వివరణ ఇచ్చారు. తనకు డేట్స్ కుదరలేదని... అందుకే ఈ చిత్రంలో నటించడం లేదని చెప్పారు.

English summary
R Madhavan, Fanney Khan mainlining Aishwarya Rai and Anil Kapoor was not that film. He was in talks for the film, but the role ultimately went to Rajkummar Rao. The role was that of Aishwarya Rai Bachchan’s love interest. There are reports that he couldn’t accommodate it because of date issues. But an insider reveals, The real story is that Madhavan asked for a huge remuneration. He wanted Rs 1.5 crore for a 15-day shoot. And the makers felt that it was not justified.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu