»   »  వీర్యదాత కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు

వీర్యదాత కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Madhura Sreedhar looking for a sperm donor
హైదరాబాద్ : టాలీవుడ్ దర్శకుడు మధుర శ్రీధర్ వీర్యదాత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మరో రకంగా అర్థం చేసుకోవద్దు సుమీ. ఆయన వీర్యదాత పాత్రకు సరిపోయే పర్ ఫెక్ట్ హీరో కోసం ఎదురు చూస్తున్నారు. హిందీలో మంచి విజయం సాధించిన ఆయుష్మాన్ ఖురానా నటించని 'వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీర్యం దానం చేసే ఓ వ్యక్తి కథ ఈ మూవీ.

దాదాపు సంవత్సరం తర్వాత మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, అయితే కథకు సరిపోయే కథానాయకుడు దొరకడం లేదని అంటున్నాడు మధుర్ శ్రీధర్. త్వరలోనే సబ్జెక్టుకు సూటయ్యే హీరోను వెతికి పట్టుకుంటానంటున్నాడు.

గతంలో ఈచిత్రం కోసం మధుర శ్రీధర్ హీరో నానిని సంప్రదించాడు. అయితే నాని బ్యాండ్ బాజా భారత్, జెండాపై కపిరాజు చిత్రాలతో బిజీగా ఉండటంతో హీరో రానాతో ఈచిత్రం చేయాలనుకున్నాడు. అయితే రానా కూడా రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో బిజీగా ఉండటంతో కుదరదనిచెప్పాడు.

ప్రస్తుతం మధుర శ్రీధర్ కన్ను బస్టాప్, నీకు నాకు చిత్రాల హీరో ప్రిన్స్‌పై పడింది. ఈచిత్రం కోసం కొన్ని కిలోల బరువు తగ్గాలని సూచించాడట. అయితే ప్రిన్స్ కూడా ఈ ప్రాజెక్టుకు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. దీంతో కొత్త వారితోనే సినిమా చేయాలని నిర్ణయించినట్లు మధుర శ్రీధర్ వెల్లడించారు.

English summary
Director Madhura Sreedhar is looking for a sperm donor. Don't mistake me. He is in search of a suitable hero for his upcoming Telugu movie, which will be a remake of Ayushmann Khurrana's hit Hindi film Vicky Donor. Almost a year has passed after the director announced the project. Although everything is ready for the shoot, he is still struggling to rope in a suitable actor for the lead role in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu