»   » 'రోబో' రిలీజ్ తర్వాతే రామ్ చరణ్ చిత్రం ఉంటుంది..అల్లు శిరీష్

'రోబో' రిలీజ్ తర్వాతే రామ్ చరణ్ చిత్రం ఉంటుంది..అల్లు శిరీష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మేము రోబో చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇన్నాళ్ళూ ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫూజ్ గా ఉంది. ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసారు..కాబట్టి ఆ చిత్రం రిలీజైన ఆరు వారాల తర్వాత మేము మార్కెట్ లోకి వస్తాం. మా మగధీర తమిళ వెర్షన్ రిలీజ్ చేస్తాం అని ట్వీట్ చేసారు అల్లు శిరీష్. ఇక 'మగధీర" తమిళంలో 'మన్నాది మన్నన్" పేరుతో అనువాదమవుతోంది. తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకునే నటుడు, రచయిత, దర్శకుడు కె. భాగ్యరాజా తొలిసారి 'మన్నాది మన్నన్" కు మాటలు రాసారు. అలాగే సీనియర్ గేయ రచయిత వాలి పాటలు రాయించారు. ఈ చిత్ర తమిళ హక్కులను కలైపులి యస్. ధాను సొంతం చేసుకున్నారు. 60వ దశకంలో యం.జి.ఆర్ నటించిన 'మన్నాది మన్నన్" టైటిల్ తో తెలుగు మగధీర తమిళంలోకి జూన్ లో అడుగుపెడుతున్నాడు. రామచరణ్ తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే ఇప్పుడు ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా రావటంతో మంచి క్రేజ్ వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu