»   » మహానటి: ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ వీడియో

మహానటి: ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో కేవలం సావిత్రిని మాత్రమే కాదు... తెలుగు సినిమాకు తొలినాళ్లలో జీవం పోసి ఇపుడు పరిశ్రమ ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో కృషి చేసిన ఎందరో ప్రముఖులను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఆలూరి చక్రపాణి.

Mahanati: Prakash Raj as Aluri Chakrapani

తెలుగింట ఆవకాయ లేని వంటగది, చందమామ కథలు లేని బాల్యం బహుషా లేవేమో! మనందరి మొదటి కథలను మనకు అందించిన మహా రచయిత బహుబాషా పండితుడు, నిర్మాత, దర్శకుడు చక్రపాణి. చందమామ విజయా కంబైన్స్ స్థాపకుల్లో ఒకరైన చక్రపాణి మహానటి సావిత్రి నట జీవితంలో కలికితురాయి లాంటి గుండమ్మ కథ, మిస్సమ్మతో పాటు ఎన్నో చిత్రాలు మనకు అందించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అలనాటి చక్రపాణి గారి పాత్రలో ఇపుడు మనకు కనిపించబోతున్నారు యావత్ భారత్ దేశం గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్‌ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు.

Vijay DevaraKonda Has Signed A New Movie

స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, శాలిని పాండే, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.

English summary
Here is the Character Intro of Prakash Raj as Aluri Chakrapani in Mahanati.The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. #Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X