Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహానటి: కెవి చౌదరిగా కనిపించబోతోన్న రాజేంద్రప్రసాద్
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రంలో ఆమె జీవితంలోని ముఖ్యవ్యక్తులందరినీ చూపించబోతున్నారు. సావిత్రి సినిమా పరిశ్రమ వైపు రావడానికి ప్రధాన కారణం కెవి చౌదరి. ఆయనే లేకుంటే సావిత్రి తెలుగు తెరపై ఉండేవారు కాదేమో?
కెవి చౌదరి... సావిత్రి పెదనాన్న. కారు డ్రైవరుగా జీవితాన్ని ప్రారంభించారు. కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహానటిని మనకు పరిచయం చేశారు. ఆయన ఆలోచనలో అది ఆశే కావచ్చు, అదే తెలుగు వారికి ఆశాజ్యోతిని అందించింది. 'మహానటి'లో ఈ పాత్రను పోషించింది మన నట కిరీటి రాజేంద్రప్రసాద్. ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ ప్రోమో వీడియో విడుదల చేశారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, మాళవికా నాయర్, భానుప్రియ, శాలిని పాండే, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.