»   » మహేష్ బాబుతో పోటీపడుతున్న ఏకైక ‘మహానుభావుడు’ (ట్రైలర్)

మహేష్ బాబుతో పోటీపడుతున్న ఏకైక ‘మహానుభావుడు’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahanubhavudu Trailer 'స్పైడర్' తో మహానుభావుడు పోటీ!

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

దసరా సీజన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'స్పైడర్' రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పోటీ పడుతూ విడుదలవుతున్న ఏకైక చిత్రం 'మహానుభావుడు' కావడంతో ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చనీయాంశం అయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

వాయిదాలు మీద వాయిదాలు పడుతూ ఇలా

వాయిదాలు మీద వాయిదాలు పడుతూ ఇలా

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ - ``మ‌హానుభావుడు చిత్రాన్ని ఎప్పుడో రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే మ‌ధ్యలో హాలీడేస్ రావడంతో వ‌ద్ద‌ని అనుకున్నాం. ద‌స‌రా పండ‌గ‌కి ఇలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా వ‌స్తే బావుంటుంద‌ని నిర్మాత‌లు అన‌డంతో సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్నామని తెలిపారు.


ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మూవీ

ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మూవీ

చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వాళ్ల వ‌ర‌కూ కుటుంబం అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను చేయ‌లేదు. ఇలాంటి స్క్రిప్ట్ మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంద‌ని అనుకోవ‌డం లేదు... అని శర్వానంద్ తెలిపారు.


మహానుభావుడు

మహానుభావుడు

ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె ముఖ్య పాత్రలు


ట్రైలర్

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి


English summary
Mahanubhavudu Official Theatrical Trailer released. Mahanubhavudu 2017 film ft. Sharwanand & Mehreen Kaur Pirzada. Music by Thaman S. Written and directed by Maruthi. Produced by Vamsi, Pramod and SKN, Mahanubhavudu movie also stars Nasser, Vennela Kishore, Raghu Babu, Venu Tillu, Bhadram, Anand, Gemini Suresh, Kalyani Natarajan and among others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X