»   » మహేష్ ‘1’లో ఇంత విషయం ఉందా? గొప్పలు చెబుతున్న నిర్మాతలు!

మహేష్ ‘1’లో ఇంత విషయం ఉందా? గొప్పలు చెబుతున్న నిర్మాతలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సినిమాను ఎంత గొప్పగా తీసామనే విషయాలతో పాటు ఎంత గొప్పగా విడుదల చేస్తున్నామనే విషయాల గురించి వెల్లడించారు.

తమ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుందని, సెన్సార్ బోర్డు సభ్యుల నుండి కూడా ప్రశంసలు అందాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1250 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టోటల్ ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్లలో సినిమా విడుదల అవుతోందని తెలిపారు.

సినిమా షూటింగ్ మొత్తం 170 రోజుల పాటు జరిగిందని, అందులో 60 రోజుల పాటు లండన్లో చిత్రీకరణ జరిపామని తెలిపారు. లండన్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా తర్వాత వన్ సినిమా కోసం ఒక బ్రిడ్జిని బ్లాక్ చేసి షూటింగ్ చేసాం. ఈరోస్ సంస్థ వారికి సినిమా కథ బాగా నచ్చడంతో తమతో టై అప్ అయ్యారని చెప్పుకొచ్చారు. త్వరలో సినిమాను జర్మనీ, ఫ్రాన్స్ బాషల్లోనూ డబ్ చేసి విడుదల చేస్తామన్నారు.

తమ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌటం తెరకు పరిచయం అవుతుండటం సంతోషంగా ఉందని, గౌతం చాలా బాగా నటించాడు. డబ్బింగ్ కూడా సింగిల్ టేక్ లో పూర్తి చేసాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిగా బయటకు వస్తాడు అని తెలిపారు.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈచిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.

English summary

 Mahesh '1' movie producers press meet held today in Hyderabad. Final copy of 1-Nenokkadine has completed and submitted to censor authorities. The censor formalities has completed and the movie is rated as U/A and the certificate awarded on Monday, Now the film can be out on Jan 10 as promised.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu