»   » అక్టోబర్ 16న మహేష్ బాబు ‘ఆగడు'

అక్టోబర్ 16న మహేష్ బాబు ‘ఆగడు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'దూకుడు' సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల మరోసారి జతకట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో రూపొందనున్న మరో చిత్రం 'ఆగడు' ప్రారంభానికి అక్టోబర్ 16న ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి దర్శకుడు శ్రీను వైట్ల ప్లాన్ చేసాడట. అంటే షూటింగ్ ఒక్కసారి మొదలైతే పూర్తయ్యే వరకు గ్యాప్ లేకుండా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఈ చిత్రంలో హీరోయిన్ త్వరలో ఫైనల్ కానుంది.

శ్రీను వైట్ల ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు'ఈ రెండు ప్రాజెక్ట్ లనూ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. 1(నేనొక్కడినే) సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది.

English summary
As per the latest news being heard, Mahesh Babu's Aagadu Movie will begin working from Oct 16. The Shoot in a Single Schedule. Srinu Vaitla will handle the direction for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu