»   » ఫోర్బ్స్ లిస్ట్ : మహేష్, రాజమౌళి, బన్నీ, ప్రభాస్ సంపాదనలో టాప్

ఫోర్బ్స్ లిస్ట్ : మహేష్, రాజమౌళి, బన్నీ, ప్రభాస్ సంపాదనలో టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తదితరుల సంపాదన వివరాలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2015 సంవత్సరానికి గాను సంపాదన విషయంలో ఇండియన్ టాప్ 100 లిస్టులో చోటు దక్కించుకున్న ప్రముఖుల వివరాలు విడుదల చేసింది. ఈ టాప్ 100 లిస్టులో ఈ సారి ఎక్కువ మంది టాలీవుడ్ సెలబ్రిటీలు చోటు దక్కించుకున్నారు.

సంపాదన విషయంలో టాలీవుడ్లో మహేష్ బాబు అందరి కంటే ముందు ఉన్నాడు. ఇక ఇండియన్ టాప్ 100 లిస్టులో ఆయన ఓవరాల్ గా 32వ స్థానంలో నిలిచాడు. ఫేమ్ ర్యాంక్ 78 ఉండగా, మనీ ర్యాంక్ 13గా ఉంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎవరాల్ గా 42వ స్థానం దక్కించుకున్నాడు. బన్నీ ఫేమ్ ర్యాంక్ 67, మనీ ర్యాంక్ 22గా ఉంది. టాప్ 50లో ఈ ఇద్దరు తెలుగు స్టార్లకు మాత్రమే చోటు దక్కింది.

టాప్ 100 లిస్టులో చోటు దక్కించుకున్న వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శృతి హాసన్, రవితేజ, పూరి జగన్నాధ్ తదతరులు ఉన్నారు. అక్టోబర్ 1, 2014 నుండి సెప్టెంబర్ 30, 2015 మధ్య గణాంకాల ఆధారంగా ఈ లిస్టు విడుదల చేసారు.

నెం.1 స్థానంలో షారుక్ ఖాన్ (రూ. 257.5 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే షారుక్ మనీ ర్యాంక్ 1, ఫేమ్ ర్యాంక్ 4గా ఉంది. ఆ తర్వాతి 2 స్థానంలో సల్మాన్ ఖాన్ (రూ. 202.75), మనీ ర్యాంక్ 2, ఫేమ్ ర్యాంక్ 2 గా ఉంది. తర్వాత అమితాబ్ బచ్చన్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన రూ. 112 కోట్ల సంపాదనతో మనీర్యాంక్ 5, ఫేమ్ ర్యాంక్ 1గా ఉంది.

టాప్ 10 లిస్టులో ఇంకా మహేంద్ర సింగ్ ధోనీ(రూ.119.33 కోట్ల), అమీర్ ఖాన్( రూ.104.25 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.127.83 కోట్లు), విరాట్ కోహ్లి (రూ.104.78 కోట్లు), సచిన్ (రూ.40 కోట్లు), దీపిక పదుకోన్ (రూ.59 కోట్లు), హృతిక్ రోషన్( రూ.74.5 కోట్లు) ఉన్నారు.

స్లైడ్ షోలో తెలుగు సెలబ్రిటీల వివరాలు....

మహేష్ బాబు

మహేష్ బాబు

సంపాదన విషయంలో టాలీవుడ్లో మహేష్ బాబు అందరి కంటే ముందు ఉన్నాడు. ఇక ఇండియన్ టాప్ 100 లిస్టులో ఆయన ఓవరాల్ గా 32వ స్థానంలో నిలిచాడు. ఫేమ్ ర్యాంక్ 78 ఉండగా, మనీ ర్యాంక్ 13గా ఉంది. సంపాదన మొత్తం: రూ. 51.5 కోట్లు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఓవరాల్ గా 42వ స్థానంలో ఉన్న బన్నీ ఫేమ్ ర్యాంక్ 67, మనీ ర్యాంక్ 22గా ఉంది. సంపాదన రూ. 37.5 కోట్లు.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

ఓవరాల్ గా 58వ స్థానంలో ఉంది. ఫేమ్ ర్యాంక్ 45, మనీ ర్యాంక్ 64, సంపాదన్ రూ. 10.13 కోట్లు

శృతి హాసన్

శృతి హాసన్

ఓవరాల్ గా 61వ స్థానంలో ఉంది. ఫేమ్ ర్యాంక్ 47, మనీ ర్యాంక్ 74, సంపాదన 8 కోట్లు.

రాజమౌళి

రాజమౌళి

రాజమౌళి 72వ స్థానంలో ఉన్నారు. ఫేమ్ ర్యాంక్ 84, మనీ ర్యాంక్ 30, సంపాదన రూ. 26 కోట్లు

రవితేజ

రవితేజ

రవితేజ 74వ స్థానంలో ఉన్నారు. ఫేమ్ ర్యాంక్ 65, మనీ ర్యాంక్ 57, సంపాదన రూ. 12.5 కోట్లు.

ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ 77వ స్థానంలో ఉన్నారు. ఫేమ్ ర్యాంక్ 88, మనీ ర్యాంక్ 33, సంపాదన రూ. 24 కోట్లు.

పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్

పూరి 89వ స్థానంలో ఉన్నారు. ఫేమ్ ర్యాంక్ 94, మనీ ర్యాంక్ 48, సంపాదన రూ. 15.67 కోట్లు.

English summary
The famous magazine, Forbes, released the list of top 100 celebrities of India for the year 2015, as we are almost on the verge of entering the new year. Interestingly, many of our Tollywood celebrity made it to the list this time. Mahesh Babu and Allu Arjun adhered the positions 36 and 42, respectively. While the Superstar and Stylish star are the only Telugu celebrities in the Top 50, Prabhas, Rajamouli, Kajal Aggarwal, Shruti Haasan, Ravi Teja and Puri Jagannadh accompanied them by bagging a place in the top 100 list.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu