»   » రాజకీయాలు నా ఆప్షన్ కాదు.. డైరెక్టర్‌గా మారడం గురించి మహేష్ మనసులో మాట!

రాజకీయాలు నా ఆప్షన్ కాదు.. డైరెక్టర్‌గా మారడం గురించి మహేష్ మనసులో మాట!

Subscribe to Filmibeat Telugu
Mahesh Babu About Joining Politics

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. కొరటాల దర్శకత్వం వహించిన శ్రీమంతుడు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విడుదల సమయంలో దగ్గర పడుతుండడంతో మహేష్ బాబు ప్రమోషన్స్ ప్రారంభించాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిత్రం గురించి పలు విషయాలు వెల్లడించాడు.

సామజిక భాద్యత గుర్తుచేసే చిత్రం

సామజిక భాద్యత గుర్తుచేసే చిత్రం

భరత్ అనే నేను చిత్రం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేసేలా ఉంటుందని మహేష్ తెలిపారు. బలవంతగా తమ అభిప్రయాలని వారిపై రుద్దడం కాదు. కానీ సమాజం గురించి కూడా ఆలోచించవలసిన భాద్యత ఉంది అని మత్రమే ఈ చిత్రం గుర్తు చేస్తుందని అన్నారు. సినిమా అంతపెద్ద మీడియం అని మహేష్ అభిప్రాయ పడ్డారు.

స్టార్ ఇమేజ్ ఉపయోగపడుతుంది

స్టార్ ఇమేజ్ ఉపయోగపడుతుంది

ప్రజలకు సరైన భావజాలం చేరవేయడంలో సినిమాలు, స్టార్ ఇమేజ్ ఉపయోగపడుతుందని మహేష్ బాబు అన్నారు. ఎంత బలంగా వెళుతుందనేది సినిమాలోని కంటెంట్ పై ఆధారపడి ఉంటుందని మహేష్ తెలిపాడు.

సమూలమైన మార్పు జరుగుతుందని అనను

సమూలమైన మార్పు జరుగుతుందని అనను

కేవలం ఒకటి రెండు చిత్రాలతో సమూలమైన మార్పు జరుగుతుందని తాను అనడం లేదని మహేష్ అన్నారు. కానీ సినిమాలద్వారా సోషల్ మెసేజ్ ని అందించే ప్రయత్నం చేయవచ్చని అన్నారు. అలంటి ప్రయత్నమే ఈ భరత్ అనే నేను చిత్రం అని మహేష్ తెలిపారు.

 రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన

రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన

రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని మహేష్ తెలిపారు. రాజకీయాలు తన ఆప్షన్ కాదని మహేష్ అన్నారు. సినిమా ద్వారా ఆడియన్స్ కి వినోదం అందించడమే తనకు తెలుసు అని అన్నారు.

 అసంతృప్తి చెందకూడదు

అసంతృప్తి చెందకూడదు

నా సినిమా చూడడానికి ప్రేక్షకుడు పెట్టిన ఖర్చు వృధా అయిందనే భావన వారిలో కలగకూడదని తాను భావిస్తానని మహేష్ అన్నారు. సినిమా చూసాక వారు సంతృప్తిగా ఇంటికివెళ్లేలా తన సినిమాలు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, ఆ దిశగానే కష్టపడతానని మహేష్ తెలిపాడు.

ఆ రెండు చిత్రాలు విభిన్నమైనవి

ఆ రెండు చిత్రాలు విభిన్నమైనవి

బాహుబలి, అర్జున్ రెడ్డి చిత్రాలు రెండూ విభిన్నమైనవి. ఆ రెండు చిత్రాలు నాకు నచ్చాయి అని మహేష్ బాబు అన్నారు. అలాంటి చిత్రాలు తెలుగులో ఇంకా రావలసిన అవసరం ఉందనిమహేష్ అన్నారు.

దర్శత్వం చేసే ఆలోచన

దర్శత్వం చేసే ఆలోచన

తాను దర్శకత్వం వహించడం ఇప్పట్లో జరగదని మహేష్ అన్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటించడాన్ని ఆస్వాదిస్తున్నా. తాను దర్శత్వం వహించడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు అని మహేష్ బాబు తెలిపారు.

తదుపరి చిత్రం

తదుపరి చిత్రం

తన తదుపరి చిత్రం అశ్వినీదత్, దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని మహేష్ తెలిపారు. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు.

English summary
Mahesh Babu about joining politics. Politics is not an option for me says Mahesh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X