»   »  అప్పుడు ఊరు విడిచివెళ్లిపోతా: మహేష్ బాబు

అప్పుడు ఊరు విడిచివెళ్లిపోతా: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఏంటీ.. ఎప్పుడూ రాజకీయాలు.. రాజకీయాలని పదే పదే అడుగుతారు.. గతంలో ఒకసారి రాజకీయాలోకి వచ్చే ఆలోచన లేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. వచ్చే ఎన్నికల సమయంలో నేను హైదరాబాద్‌లో ఉండను. ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.. అని మహేష్‌బాబు మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.


అలాగే రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించే విషయం గురించి చెప్తూ... ఇప్పటివరకు ఏమీ లేదు. కథ నచ్చితే తప్పకుండా నటిస్తా అన్నారు. ఇక జేమ్స్‌బాండ్‌ తరహా కథ గురించి ఆలోచన ఏమీ లేదని స్పంష్టం చేసారు.

తన తండ్రి కృష్ణ చేసిన చిత్రాలు రీమేక్ గురించి చెప్తూ... అలాంటిదేమీ లేదు. నాన్న తీసిన సినిమాలు రీమేక్‌ చేసి వాటిని చెడగొట్టను. ఆయన సినిమాల్లో పాటల గురించి మాత్రం ఆలోచిస్తా అన్నారు.

తాజా చిత్రాల సమాచారం చెప్తూ... ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో '1' చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఆ తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుంది అన్నారు.


తాజాగా సుకుమార్‌ దర్శకత్వంలో మీరు నటిస్తున్న సినిమాలో మీ అబ్బాయి గౌతమ్‌ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది అని అడగగా...
ఆ సినిమాలో చిన్నపిల్లవాడి పాత్ర ఉన్నది వాస్తవమే. సుకుమార్‌ కూడా గౌతమ్‌ని ఆ పాత్రలో పెడదామా అని అడిగారు. ఇంకా నేను గౌతమ్‌ని అడగలేదు. ఒకవేళ గౌతమ్‌ నటిస్తాను అంటే అలాగే చేస్తాం అన్నారు.

English summary

 Mahesh Babu Confirms that he is not intrested to enter in poltics. At the time of elections he was out of station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu