»   » ‘ప్రేమకథా చిత్రమ్’పై మహేష్ బాబు స్పందన

‘ప్రేమకథా చిత్రమ్’పై మహేష్ బాబు స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుధీర్ బాబు హీరోగా మారుతి దర్శకత్వం పర్యవేక్షణలో జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.పి.ఎ క్రియేషన్స్, మారుతి టాకీస్ సంయుక్తంగా ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన 'ప్రేమకథా చిత్రమ్' జూన్ 7న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు....మంచి కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ...'ప్రేమకథా చిత్రమ్ చూసాను. సినిమా చాలా బాగుంది. సుధీర్ బాబు చాలా బాగా చేసాడు. మారుతి చాలా తక్కువ బడ్జెట్‌తో మంచి ఇంపాక్ట్ వచ్చేలా చాలా బాగా హ్యాండిల్ చేసాడు. మారుతి లాంటి వారు ఇండస్ట్రీకి అవసరం. టెక్నీషియన్స్ అంతా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. సుధీర్, మారుతి, చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్' అన్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఈ చిత్రం గురించి ట్విట్టర్లో స్పందించారు. " 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాకు వెళ్లాను. చాలా బాగా ఎంజాయ్ చేసాను. కేవలం 1.8 కోట్ల బడ్జెట్ లో తీసారని విన్నాను. చాలా పెద్ద విజయం సాధించింది. కంగ్రాట్యులేషన్స్ !!" అంటూ ట్వీట్ చేసారు.

తొలి వీకెండ్ మూడు రోజుల్లో ఈచిత్రం మొత్తం రూ. 6.05 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా భారీగా లాభాలు రావడంతో ఇటు నిర్మాతల, అటు డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపగా ఉన్నారు.

English summary
“I have watched Prema Katha Chitram and I really liked it. Sudheer has done a good job. Maruthi has managed to make a strong impact with such a limited budget. The industry needs directors like Maruthi.”, said Mahesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu