»   » మహేష్ స్టైల్ కి ఈ ప్రొడక్టే పెద్ద రహస్యమంట..ఎక్కువగా అవే వాడుతాడంట..!?

మహేష్ స్టైల్ కి ఈ ప్రొడక్టే పెద్ద రహస్యమంట..ఎక్కువగా అవే వాడుతాడంట..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్ యువతను లక్ష్యంగా చేసుకుని ప్రోవోగ్ తన బ్రాండ్ ప్రచారకర్తగా మహేష్ బాబును ఎంచుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ నేను ఈ ప్రొడక్ట్స్ ని ఆధరిస్తున్నాను కాబట్టే ఈ ప్రొవోగ్ నన్న అంబాసిడర్ గా ఎంపిక చేసింది. సో 'ఒక గొప్ప బ్రాండ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. స్టైల్ కు, ఆధునికతకు, సృజనతో కూడిన ఫ్యాషన్ కు చిరునామా ప్రోవోగ్. ప్రోవోగ్ కలక్షన్లు ఆంధ్రప్రదేశ్ అంతటా తమ ఉనికిని కొనసాగించాలని కోరుకుంటున్నాను' అని అన్నాడు.

ప్రోవోగ్ డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ చతుర్వేది మాట్లాడుతూ 'ప్రోవోగ్ కు జాతీయ గుర్తింపు ఉంది, మహేష్ తో కలయిక అదనపు గుర్తింపు. ప్రోవోగ్ స్టైల్ కు, ఫ్యాషన్ కు పెట్టింది పేరు దానికి మహేష్ గ్లామర్ మరియు స్టైల్ కలిస్తే బ్రాండ్ కు కొత్త ఇమేజ్ ఏర్పడుతుంది అని ఆశిస్తున్నాం' అన్నారు. యూత్ ను అట్రాక్ట్ చేయగలిగే స్టైల్, ఇన్నోవేటివ్ డిజైన్స్ అన్నింటిని అకర్సించే విధంగా డిజైన్ చేయబడి ఇండియాలోనే నెం వన్ ప్రొడక్ట్ గా గుర్తింపు తెస్తుందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X