»   » 4 రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు (ఫోటోస్)

4 రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu birthday celebrations

1. కర్నూల్ శ్రీ రామా లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు అహ్మద్ ఆధ్వర్యంలో హీరో మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడటం, ఆగష్టు 9 న జన్మ దినోత్సవ సందర్భంగా వేడుకలు నిర్వహించగా , థియేటర్ లీజ్ దారుడు కృష్ణ రెడ్డి, సీనియర్ అభిమాని మల్లి బాబులు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు . భుధవారపు పేట లో అనాధ పిల్లలకు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణి చేసి , 15 అభిమానులు రక్త దానం చేసి తమ అభిమానం ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం లో రామ కృష్ణ యాదవ్ , షబ్బీర్ , మున్న , రవి కుమార్ , మక్సూద్ , సుందర రాజు , బీసన్న , తదితర అభిమానులు పాల్గొన్నారు .

Mahesh Babu birthday celebrations

2. గుంటూరు
చాకలి గుంట లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు దాసరి వెంకట రావు ఆధ్వర్యంలో బి . ఆర్ . ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించిన మహేష్ బాబు జన్మ దిన వేడుకల లో అర్జున్ సంఘం అధ్యక్షులు నరసాల కొండల రావు కేకు కట్ చేయగా, వై . యస్ . ఆర్ . కాంగ్రెస్ పార్టీ 17 వ వార్డ్ కన్వీనర్ పెదాల చిన్న , గార్ల కన్నాల చే విద్యార్ధులకు పండ్లు దుస్తులు పంచి తమ అభిమానం ను చాటుకున్నారు . ఈ కార్యక్రమం లో సత్తెనపల్లి నరసింహ రావు , ఓబయ్య , నాని , వెంకట కృష్ణ, మల్యాది , తదితర అభిమానులు పాల్గొన్నారు

Mahesh Babu birthday celebrations

3. తూ.గో. జిల్లా
ప్రత్తిపాడు లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన పట్టణ అధ్యక్షులు సలాది కృష్ణ ఆధ్వర్యం లో హీరో మహేష్ బాబు జన్మ దినోత్సవ సందర్భంగా , సెయింట్ జోసెఫ్ ఆసుపత్రి లోని అనాధ పిల్లలకు పండ్లు రొట్టెలు దుస్తులు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు . ఈ కార్యక్రమంలో ఇమంది అయ్యన్ , బత్తుల చంటి , యస్. జయరాజ్ , చంద్రం తదితర అభిమానులు పాల్గొన్నారు

Mahesh Babu birthday celebrations

4. కరీంనగర్
తెలంగాణా చౌక్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు మాసగొని సంతోష్ గౌడ్ ఆధ్వర్యం లో హీరో మహేష్ బాబు జన్మదినోత్సవం, శ్రీమంతుడు చిత్రం విజయవంతం అయిన సందర్భంగా 100 బైక్ ల తో ర్యాలి నిర్వహించి, వీరబ్రమ్హేంద్ర స్వామి వృద్ధుల ఆశ్రమం లో కేకు కట్ చేసి 120 మంది వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. తిరుమల థియేటర్ లో మాజీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కేకు కట్ చేయగా థియేటర్ యజమాని శ్రీనివాస్, ఎసియన్ మేనేజర్ కోటేశ్వర్ రావు పాల్గొనగా , బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్య , కొంపెల్లి మురళి, శ్రీమాన్ రెడ్డి, వినయ్ కుమార్ , సంజీవ్ రావు తదితర అభిమానులు పాల్గొన్నారు

Mahesh Babu birthday celebrations

5. కర్ణాటక
రాయచూరు లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానులు హీరో మహేష్ బాబు జన్మ దిన సందర్భంగా మాణిక్ ప్రభు దేవస్థానం లోని కళ్ళు లేని అనాధ పిల్లల సమక్షం లో మేనేజర్ కుపెంద్ర కేకు కట్ చేయగా 100 మంది పిల్లలకు అన్నదానం చెసరు. ఈ కార్యక్రమం లో వి. యురుకున్దప్ప , రమేష్, నరసింహులు, రంగప్ప, కురుమ రెడ్డి , జిన్దప్ప , నాగరాజు, శివ కుమార్, ఈశ్వర్ తదితర అభిమానులు పాల్గొన్నరు.


Mahesh Babu birthday celebrations

6. తమిళనాడు
కాంచీపురం లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానులు ఆత్మకూరి చంద్ర సాయి రామ్ ఆధ్వర్యంలో హీరో మహేష్ బాబు జన్మ దిన సందర్భంగా, శ్రీమంతుడు తెలుగు, తమిళ్ చిత్రాలు విజయవంతంగా ప్రదర్సిమ్పబడుతున్న సందర్భంగా కేకు కట్ చేసి తమ అభిమానాని చాటుకున్నారు . ఈ కార్యక్రమం లో సుహృత్ , వివేక్ , తదితర అభిమానులు పాల్గొన్నారు

Mahesh Babu birthday celebrations

7. శ్రీకాకుళం
శ్రీకాకుళంలో మహేష్ బాబు స్వచండ సేవ సమస్త జిల్లా అధ్యక్షులు ఉమ్కిలి శ్రీనివాస్ ఆధ్వర్యం లో హీరో మహేష్ బాబు జన్మదినోత్సవ , శ్రీమంతుడు విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా కిన్నెరా థియేటర్ లో నేకో స్వచండ సమస్త కు చెందిన 120 అనాధ పిల్లలకు ఉచితంగా చిత్రం తిలకించే అవకాసం కలిపించి థియేటర్ మేనేజర్ వర ప్రసాద్ కేకు కట్ చేయగా ఇటీవల నిర్వహించిన క్విజ్ పోటిలలో గెలుపొందిన పిల్లలకు రూ . 500 బహుమతి అందజేసి తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమం లో మామిడి శంకర్ , మధు గౌరీ శంకర్ జె. గోపాల్ , సాజు , తరకేస్వర్ రావు , కుమార్ స్వామి, పట్నాయ , జయరాం, మహేష్, గౌతం, జగదీశ్ , నాగరాజు, భాను, తదితర అభిమానులు పాల్గొన్నారు

Mahesh Babu birthday celebrations
English summary
Fans celebrates Mahesh Babu birthday in grand way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu