Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
మహేష్ కి ఈరోజు ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా ?
అవును ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు అంటే ఆయనకు చాలా ఇష్టం కూడా. అయితే ఈ రోజుతో ఆయన సినిమాలకు సంబంధం ఉన్నా సరే ఆయనకు ఇష్టం మాత్రం పర్సనల్ విషయం గురించి. ఎందుకంటే ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు. ఏప్రిల్ 20వ తేదీ నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే ఆ రోజు మా అమ్మ పుట్టినరోజు అని గతంలో కూడా చాలా సార్లు మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.
కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ వైరల్ ఫోటోలు..

తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
అలాగే తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను కూడా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలో మహేష్ కుమారుడు గౌతమ్ కూడా కనిపిస్తున్నాడు. నిజానికి మహేష్ తల్లి ఇందిరాదేవి బయట కనిపించడం చాలా అరుదు.. మహేష్ బాబుకు సంబంధించిన సినిమా ఫంక్షన్లలో కూడా తండ్రి కృష్ణ, దివంగత విజయనిర్మల, మహేష్ సోదరుడు, సోదరీమణులు, విజయనిర్మల కుమారుడు నరేష్ లాంటివాళ్ళు కనిపిస్తారు. కానీ తల్లి ఇందిరాదేవి మాత్రం ఎప్పుడూ కనిపించేవారు కాదు. అయితే మహేష్ మాత్రం ముఖ్యమైన స్థానాన్ని తన తల్లికి ఎప్పుడూ ఇస్తూ ఉంటారు.

కృష్ణకు ఇందిరా దేవి స్వయంగా మరదలు
ఇక కృష్ణ విజయనిర్మలది రెండో వివాహం అనే సంగతి తెలిసిందే. అయితే కృష్ణ హీరోగా మొదలైన తేనెమనసులు సినిమా మొదలయ్యే నాటికే ఇందిరాదేవితో కృష్ణ వివాహం జరిగిపోయింది. కృష్ణకు ఇందిరా దేవి స్వయంగా మరదలు అవుతారు. ఆ రోజుల్లో మేనరికాలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆయన సొంత మరదలిని పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. విజయనిర్మలతో రెండో వివాహం జరిగినా సరే ఇందిరాదేవికి ఏ లోటు రాకుండా కృష్ణ చూసుకునేవారు. విజయనిర్మల వివాహం తర్వాత కూడా ఇందిరాదేవి పెద్దగా బయటకు వచ్చింది లేదు. అడపాదడపా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనపడే వారు తప్ప సినిమా ఫంక్షన్స్ లో ఎక్కడా ఆమె కనిపించేవారు కాదు.

భరత్ అనే నేను సినిమాకి మూడేళ్ళు
ఇక మరో పక్క ఈ రోజుకి మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా రిలీజ్ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో #3YearsForBharatAneNenu ట్రెండ్ నడుస్తోంది. భరత్ అనే నేను పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు . కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం రాజమౌళి తో ప్రతిష్టాత్మక సినిమా ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్న డీవీవీ మూవీస్ అధినేత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మించారు.