For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కష్టాల నుంచి గట్టెక్కేందుకు మహేశ్.. మాస్ పల్స్ పట్టుకొంటున్న ప్రిన్స్

  By Rajababu
  |

  వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ప్రిన్స్ మహేశ్‌బాబు సక్సెస్ బాటలో పట్టేందుకు క్రేజీ డైరెక్టర్లు, ప్రాజెక్టులను ఎంచుకొంటున్నాడు. నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు మహేశ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇప్పుడు బ్రహ్మండమైన హిట్‌ను చేజిక్కించుకొనేందుకు సరైనా పావులు కదుపుతున్నట్టు ఫిలింనగర్ సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న భరత్ అనే నేను చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంటూనే సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.

   మహేశ్ కెరీర్‌లో తీవ్ర ఒడిదుడుకులు

  మహేశ్ కెరీర్‌లో తీవ్ర ఒడిదుడుకులు

  గత రెండు మూడు ఏళ్లుగా ప్రిన్స్ మహేశ్ సినిమా కెరీర్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది. సుకుమార్‌ను నమ్ముకొని చేసిన వన్ నేనొక్కడినే, శ్రీనువైట్లతో తీసిన ఆగడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ తర్వాత శ్రీమంతుడు చిత్రం రూపంలో మంచి భారీ హిట్ దొరికింది. ఇక పర్వాలేదనుకుంటుండగానే బ్రహ్మోత్సవం, స్పైడర్ మళ్లీ నిరుత్సాహాన్ని కలిగించాయి.

   ప్రిన్స్‌ మహేశపై స్పైడర్ ఎఫెక్ట్

  ప్రిన్స్‌ మహేశపై స్పైడర్ ఎఫెక్ట్

  బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు డిస్టిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించాయి. నైజాం, ఇతర ప్రాంతాల్లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దాంతో మరోసారి ప్రిన్స్ మహేశ్ సినిమా అంటేనే దడపుట్టే విధంగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకు మహేశ్ భారీగానే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

   బ్రాండ్ ఇమేజ్‌కు ముప్పు..

  బ్రాండ్ ఇమేజ్‌కు ముప్పు..

  వరుస ఫ్లాప్‌లతో సినిమా కెరీర్‌పైనే కాకుండా, అడ్వర్టైజింగ్ రంగంలో కూడా ప్రిన్స్ మహేశ్ బ్రాండ్‌కు ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో సరైన హిట్లను ఖాతాలో వేసుకోకపోతే వ్యాపార ప్రకటనల రెవెన్యూపై కూడా భారీగా కోత పడే అవకాశం ఉంది. ఓ వైపు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.

   వంశీ పైడిపెల్లికి గ్రీన్ సిగ్నల్

  వంశీ పైడిపెల్లికి గ్రీన్ సిగ్నల్

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రిన్స్ తన భరోసాను కొరటాల శివపై పెట్టాడు. వంశీ పైడిపెల్లి చెప్పిన కథకు ఒకే చెప్పాడు. ఈ రెండు సినిమాలపై మహేశ్ బాబు పూర్తిగా దృష్టిపెట్టాడు. ఇలా పక్కగా ప్లాన్ చేసుకొంటున్న ప్రిన్స్ బోయపాటి శ్రీను రంగంలోకి దించినట్టు వచ్చిన వార్త టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

   రంగంలోకి బోయపాటి శ్రీను

  రంగంలోకి బోయపాటి శ్రీను

  తాజాగా ప్రిన్స్ మహేశ్‌తో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నది. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన బోయపాటిని సదరు బ్యానర్ రంగంలోకి దించింది. సోమవారం మహేశ్, బోయపాటి మధ్య కథా చర్చలు జరిగినట్టు ఓ వార్త బయటకు పొక్కింది.

   కథపై క్లారిటీ వచ్చిన తర్వాత

  కథపై క్లారిటీ వచ్చిన తర్వాత

  ప్రిన్స్ మహేశ్, బోయపాటి మధ్య జరిగిన భేటీ ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ కథపై ఫైనల్ కావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. కథా రూపం పూర్తిగా ఓ రూపం దాల్చిన తర్వాతే ప్రిన్స్ ఏదైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది అనే ఫిలింనగర్ వర్గాల సమాచారం.

   మహేశ్‌కు దిమ్మతిరిగే స్టోరీ

  మహేశ్‌కు దిమ్మతిరిగే స్టోరీ

  ఇదిలా ఉండగా, నాగార్జునతో ఊపిరి లాంటి విభిన్నమైన సబ్జెక్ట్‌ను రూపొందించిన వంశీ పైడిపల్లి.. మహేశ్‌కు కూడా దిమ్మ తిరిగే కథను చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలో మహేశ్ పాత్ర ఏమిటో అనే విషయంపై చాలా సీక్రెట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం అమెరికాలో జరుగనున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది.

  English summary
  Superstar Mahesh Babu is desperate for a hit. Four out of his last five films have bombed at the box-office and the trade is worried about his form. Source reveal that Mahesh has an obligation to work with the producers 14 Reels Entertainment and they’re keen to rope in Boyapati for the project as he understands the pulse of the masses like no other contemporary director in Telugu filmdom. The project is still in discussion stage and it might take a few months for it to get even sanctioned. Mahesh, in the interim, will finish his current commitments and only then will this project take off, provided everything falls in place.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X