»   » బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతున్నప్పటికీ మహేష్ ఆపకుండా...

బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతున్నప్పటికీ మహేష్ ఆపకుండా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు ప్రస్తుతం ఇస్ధాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పరిస్ధితి ఏమీ బాగోలేదు. రాజకీయ అస్ధిరతతో మొన్నీ మధ్య సూసైడ్ బాంబర్స్ విధ్వంసం సృష్టించారు. దాదాపు ముప్పై రెండు మంది చనిపోయిన ఈ సంఘటనతో అక్కడ పరిశరాలు మొత్తం వణికిపోతున్నాయి. ఇంకా కొందరు సూసైడ్ బాంబర్స్ సిటీలోనే ఉన్నారని వార్తలు అందుతున్నాయి. అయినా శ్రీను వైట్ల అక్కడే కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. నవంబర్ 10 వ తేదీ వరకూ షూటింగ్ జరగనుంది. మహేష్ బాబు, యూనిట్ మొత్తం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలోని వావ్ హోటల్లో బస చేసారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. మహేష్ బాబు పోలీస్ ఆపీసర్ గా చేస్తున్నారు. సోనియా కూడా ఓ కీలక పాత్రలో కనపించనున్నదని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X