»   » డూప్ లేకుండానే మహేశ్ డేంజరస్ స్టంట్స్.. హీరోయిజాన్ని మరోస్థాయికి.. డూప్‌లకే వణుకు..

డూప్ లేకుండానే మహేశ్ డేంజరస్ స్టంట్స్.. హీరోయిజాన్ని మరోస్థాయికి.. డూప్‌లకే వణుకు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్‌బాబు స్పైడర్ కోసం ఎలాంటి డూప్ లేకుండానే ఫైట్స్ చేయడం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రొడక్షన్ డిజైనర్ రుపిన్ సుచక్ మీడియాకు వెల్లడించారు. మహేశ్ చాలా డేరింగ్ స్టంట్లు చేయడం డూప్‌లకే షాకిచ్చిందని ఆయన వెల్లడించారు. మురుగదాస్ దర్వకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ స్పైడర్ కోసం ఈ సాహసానికి పూనుకోవడం గమనార్హం.

ఊపిరి బిగపట్టి..

ఊపిరి బిగపట్టి..

స్పైడర్ చిత్రంలో ప్రిన్స్ మహేశ్‌బాబు అద్భుతమైన స్టంట్లు చేశాడు. డూప్‌లు లేకుండా మహేశ్‌బాబు స్టంట్లు చేస్తాడని మేము అసలు ఊహించలేదు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మహేశ్‌బాబు చాలా డేరింగ్‌గా ఫైట్లు చేశాడు. దాంతో మేమంత ఊపిరి బిగపట్టి షాక్‌కు గురై చూశాం అని రుపిన్ తెలిపాడు.


మహేశ్ హీరోయిజం మరోస్థాయికి..

మహేశ్ హీరోయిజం మరోస్థాయికి..

చాలామంది హీరోలు ఫైట్స్‌లో రిస్క్ తీసుకోరు. కానీ ప్రిన్స్ భయం లేకుండా స్టంట్లు చేసి హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన ఫైట్ సీక్వెన్స్‌ను చేయడానికి డూప్‌లు బయపడ్డారు. కాని మహేశ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా సునాయసంగా పూర్తి చేయడం గ్రేట్ అని మహేశ్‌బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు.


స్టైలిష్‌గా ఉంది..

స్టైలిష్‌గా ఉంది..

రుపిన్ సుచక్ గతంలో బాల్కీ తీసిన కి అండ్ కా, గౌరీ షిండే రూపొందించిన డియర్ జిందగీ చిత్రాలకు పనిచేశాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న స్పైడర్ చిత్రానికి రుపిన్ పనిచేస్తున్నాడు. మురుగదాస్ పనితీరు చాలా స్టైలిష్‌గా ఉంది. ప్రొడక్షన్ పరంగా మంచి పనిచేయడానికి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. దాంతో స్టైలిష్‌గా ప్రొడక్షన్ పనులను పూర్తిచేశాను అని రిపిన్ పేర్కొన్నాడు.


రియల్ లొకేషన్లలో షూట్

రియల్ లొకేషన్లలో షూట్

స్పైడర్ చిత్రం కోసం 50 శాతం రియల్ లొకేషన్లలో చిత్రీకరించాం. మిగితా భాగం సెట్‌లో షూట్ చేశాం. స్పైడర్ చిత్రం టెక్నికల్ అద్భుతమైన సినిమా. స్టోరికి తగినట్టు లొకేషన్లను ఎంపిక చేశాం. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో రెండు సెట్లు వేయడం చాలా చాలెంజింగ్ మారింది అని ఆయన వెల్లడించారు.


అద్భుతమైన కథ..

అద్భుతమైన కథ..

స్పైడర్ చిత్రం అద్భుతమైన కథ. ఈ సారి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే సన్నివేశాలను మురుగదాస్ రూపొందించారు. అంతర్జాతీయ, దేశీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకొన్నది అని రుపిన్ పేర్కొన్నారు. ఎన్వీఆర్ సినిమా చిత్ర పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో మహేశ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్‌ పాత్రలో కనిపిస్తాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.


English summary
Tollywood superstar Mahesh Babu has done incredible stunts in the AR Murugadoss’ action-thriller Spyder without any dupe. Mahesh even performed the stunts the body doubles were scared of attempting. Produced by NVR Cinema, Spyder features Rakul Preet opposite Mahesh Babu. Tamil actor-director SJ Suryah as the antagonist, veteran lensman Santhosh Sivan’s first Telugu film. Harris Jayaraj has composed the music for the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu