twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊరి కోసం... మహేష్ బాబు తరుపున భారీ విరాళం అందజేసిన నమ్రత!

    తాజాగా నమ్రత రూ.30 లక్షలను నాట్కో ట్రస్టు ద్వారా సిద్దాపురం లో అభివృద్ధి పనుల కోసం అందజేసారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెక్ ను అందజేశారు..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలా మంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరిస్తూ... అభిమానులు తన దారిలో నడిచేలా చేస్తున్నాడు.

    శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటన్నారు.

     రూ.30 లక్షలు

    రూ.30 లక్షలు

    తాజాగా నమ్రత రూ.30 లక్షలను నాట్కో ట్రస్టు ద్వారా సిద్దాపురం లో అభివృద్ధి పనుల కోసం అందజేసారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెక్ ను అందజేశారు..

    పాఠశాల నిర్మాణం కోసం

    పాఠశాల నిర్మాణం కోసం

    రూ. 30 లక్షలను గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు గ్రామాలను సంబంధించిన అభివృద్ధి పనులను నమ్రత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

    మహేష్ బాబు మామూలోడు కాదు: ఆ వివాదానికి మద్దతు ఇచ్చింది అందుకే?

    మహేష్ బాబు మామూలోడు కాదు: ఆ వివాదానికి మద్దతు ఇచ్చింది అందుకే?

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సౌమ్యుడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆయన వీలైనంత దూరంగా ఉంటారు. తాజాగా మహేష్ బాబు ఓ వివాదానికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!

    మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!

    త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు మహేష్ బాబు సతీమణి నమ్రత. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    It is known fact that Mahesh Babu adopted Siddhapuram village after Srimthanudu movie to improve basic infrastructure and proper education to the children. Namrata met the Ranga Reddy District collector Raghunandan Rao recently and handed over a cheque of 30 lakh through NATCO trust for constructing a school building in Siddhapuram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X