»   » మీ లాంటి ఫ్యాన్స్ ఇంకే హీరోకూ ఉండరు: మహేష్ బాబు మాటలు గమనించారా??

మీ లాంటి ఫ్యాన్స్ ఇంకే హీరోకూ ఉండరు: మహేష్ బాబు మాటలు గమనించారా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య హీరోలంతా ఒక పద్దతిని ఫాలో అవుతున్నారు... 90ల్లో చిరంజీవి లాగా అభిమానులని పూర్తిగా ఫ్లాట్ చేసి పడేస్తున్నారు. మొన్న జై లవ కుశ ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ "మానాన్న కంతే మీరే ఎక్కువ" అనేసరికి ఒక్కొక్కరికీ గుండే బరువెక్కింది. అదే పద్దతిలో నిన్న మహేష్ కూడా అభిమానులని ఆకాశానికి ఎత్తేసాడు. అసలు మహేష్ ఇలా మాట్లాడగలడా? అని ఆశ్చర్యపోయేలా మహేష్ మాట్లాడటం వింతగానే ఉంది...

అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది.

అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది.

నిన్నటి ‘స్పైడర్' ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ.. ‘‘మీ లాంటి ఫ్యాన్స్ ఇంకే హీరోకూ ఉండరు'' అనగానే ఒక్కసారిగా అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది. నా అభిమానులు ఇంత అంత.. అంటూ ఎప్పుడూ అభిమానుల్ని ఉద్రేకపరిచే మాటలు మాట్లాడని మహేష్.. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇచ్చేశాడో అని అందరూ షాకయ్యారు.

మళ్లీ ఆ మాటను రిపీట్ చేసి

మళ్లీ ఆ మాటను రిపీట్ చేసి

ఏదో ఫ్లోలో ఆ మాట వచ్చేసిందేమో అనుకుంటే.. మహేష్ మళ్లీ ఆ మాటను రిపీట్ చేసి.. తాను ఇలా ఎందుకన్నాడో వివరణ కూడా ఇచ్చాడు."మీరు నేను మంచి సినిమా చేస్తేనే చూస్తారు. బాలేని సినిమా చేస్తే ప్రేక్షకుల కంటే ముందు మీరే చూడరు. అందుకే మీరంటే నాకిష్టం. మీరు అలాగే ఉండండి.

ఇలాంటి అభిమానులు ఏ హీరోకూ ఉండరు

ఇలాంటి అభిమానులు ఏ హీరోకూ ఉండరు

ఇలాంటి అభిమానులు ఏ హీరోకూ ఉండరు.. అని చెప్పాడు మహేష్. నా సినిమాలు ఎలా ఉన్నా చూడండి.. అభిమానుల కోసమే ఈ సినిమా అనే హీరోలు చాలామందిని చూశాం కానీ.. ఇలా మంచి సినిమా అయితేనే చూడండి.. లేకుంటే చూడొద్దు అనే స్టేట్మెంట్ ఇచ్చిన స్టార్ హీరో మహేష్ ఒక్కడే అని చెప్పాలి.

సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు

సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు

ఈ మాటలతో మహేష్ అభిమానుల్నే కాదు.. సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. ఒక సినిమాకు హైప్ తేవడంలో, ఓపెనింగ్స్‌ రావడంలో అభిమానుల పాత్ర చాలా కీలకం. అందుకే స్టార్ హీరోలు అభిమానుల్ని ఆకాశానికెత్తేస్తుంటారు. ఆ క్రమంలో నా ప్రతి సినిమానూ మీరు ఆదరించారంటూ మాట్లాడ్డం చూస్తుంటాం అయితే ఈ రొతీన్ ఫార్ములాకి విరుద్దంగా చివరినుంచీ నరుక్కొచాడు.

English summary
Super Star Mahesh Babu delivers an emotional speech at SPYder pre-release event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu