For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫొటోలు: మహేష్ ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ , 'భరత్ అను నేను' మ్యాటర్ ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ : దివ్వెల పండుగ దీపావళి వేడుకలను టాలీవుడ్‌ తారలు తమ కుటుంబసభ్యులు, సహనటీనటులతో ఎంతో ఆనందంగా జరుపుకొంటున్నారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని తమ సందేశాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలియజేశారు.

  ఇక మహేష్ బాబు కుటుంబం కూడా తన బంధువులతో , స్నేహితులతో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలతో కలిసి బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా తన సన్నిహితులకు, మిత్రులకు బహుమతులు కూడా పంపారు.

  ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో మరో సినిమా ప్లాన్ చేశాడు మహేష్. ఆ సినిమా కూడా మరో సోషల్ మెసేజ్ ఇచ్చే అంశమే అంటున్నారు. అయితే దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఆ టైటిల్ ఏమిటి.. దీపావళి పొటోలతో ఆ వివరాలు అందిచనున్నాం.

   మహేష్ పిల్లలిద్దరి సందడి

  మహేష్ పిల్లలిద్దరి సందడి

  జూబ్లిహిల్స్ లో మహేష్ ఇంటిలో గౌతమ్, సితారలు చేస్తున్న దీపావళి హడావుడి ని చూడండి. నమ్రత తన ఇంటిలో జరుగుతున్నా దీపావళి సంబరాల ఫోటోలను తన ఫేస్ బుక్ లో పెట్టి మహేష్ అభిమానులు అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియచేసింది.

   పిల్లల హంగామా చూసి

  పిల్లల హంగామా చూసి

  సౌండ్స్ లేని క్రాకర్స్ కాలుస్తూ ఆ క్రాకర్స్ వెలుగుల మధ్య తన పిల్లలు చేస్తున్న దీపావళి హంగామా ను చూసి మహేష్ మురిసిపోయాడని తెలుస్తోంది. ఈ హంగామాలో మహేష్ బాగా ఎంజాయ్ చేసాడని చెప్తున్నారు.

   కొంత భాగం షేర్ చేసి మరీ..

  కొంత భాగం షేర్ చేసి మరీ..

  గౌతమ్ తన ఇంటి చుట్టుపక్కల స్లమ్ ఏరియాలో ఉండే స్ట్రీట్ చిల్డ్రన్ కు దీపావళి సందర్భంగా వారికి కూడా ఆనందాన్ని పంచుతూ తన క్రాకర్స్ లోని కొంత భాగాన్ని వారికి షేర్ చేశాడట.

  బందువులతో

  బందువులతో

  కామెడీ హీరో నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నరేష్...మహేష్ కు బంధువు. ఆయన తన కుటుంబంతో కలిసి మహేష్ ఇంటికి వచ్చి ఈ పండుగని జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ తో మహేష్ తో పాటు పాలుపంచుకున్నారు.

   ప్రతిష్టాత్మక చిత్తరం

  ప్రతిష్టాత్మక చిత్తరం

  ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలోనే చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల చేయబోయే సినిమా కూడా ఇదే. సీనియర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. ఈ సినిమా జనవరిలోనే మొదలుకాబోతోంది.

  ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివనే ప్రకటించాడు. తన కెరీర్లో ఇది మరో ప్రతిష్టాత్మక చిత్రం అని కొరటాల అన్నాడు. కొరటాల-మహేష్ కాంబినేషన్లో ‘శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే.

   అవన్నీ ప్రక్కన పెట్టి

  అవన్నీ ప్రక్కన పెట్టి

  మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ కు చాలా ఆప్షన్లే ఉన్నాయి. అతడి కోసం విక్రమ్ కె.కుమార్.. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు లైన్లో ఉన్నారు. త్రివిక్రమ్ తో కూడా ఓ కమిట్మెంట్ ఉంది. ఐతే వాటన్నింటినీ పక్కనబెట్టి తనకు ‘శ్రీమంతుడు' లాంటి ఆల్ టైం హిట్ ఇచ్చిన కొరటాలతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు మహేష్.

   నిజానికి కొరటాల కు కూడా

  నిజానికి కొరటాల కు కూడా

  కొరటాలకు కూడా వేరే కమిట్మెంట్లు ఉన్నప్పటికీ.. మహేష్ బాబునే ఎంచుకున్నాడు. ఈ సినిమాకు ఇంకా స్క్రిప్టు సిద్ధం కాలేదు. జస్ట్ ఓ లైన్ మాత్రమే అనుకున్నారు. ప్రశాంతంగా కూర్చుని రాబోయే నాలుగు నెలల్లో స్క్రిప్టు పూర్తి చేస్తాడు కొరటాల. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లని సమాచారం.

   మహేష్ మంచి మూడ్ లో ఉంటే

  మహేష్ మంచి మూడ్ లో ఉంటే

  'హీరోలందరిలో మహేష్ బాబు బాగా జోక్స్ వేస్తారు. ఆయన కాస్త మంచి మూడ్ లో ఉండాలే కానీ.. అందరినీ కూచోబెట్టుకుని మరీ జోక్స్ వేసి నవ్వుతూ ఉంటారు. అలాంటి మహేష్ బాబును చాలా తక్కువ మందే చూసుంటారు. కానీ ఆయన జోక్స్ వేస్తే మాత్రం అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయ్. ఆయనకు ఉన్నంత కామెడీ సెన్స్.. కామెడీ టైమింగ్ స్టార్ హీరోల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది' అంటున్నాడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి.

   వంశీపైడిపల్లితోనూ, కొరటాల తోనూ

  వంశీపైడిపల్లితోనూ, కొరటాల తోనూ

  మురుగదాస్ మూవీ షూటింగ్ జనవరినాటికి పూర్తి చేసేసి.. ఆ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో ఒకటి వంశీ పైడిపల్లితో అయితే.. రెండోది శ్రీమంతుడుతో తనకు ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాలతో చేయనున్నాడు.

   ఈ మధ్యకాలంలో రాలేదు

  ఈ మధ్యకాలంలో రాలేదు

  పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో మహేష్-కొరటాల సినిమా ఉండనుందని.. టాలీవుడ్ లో ఈ జోనర్ టచ్ చేసి చాలాకాలం కావడంతో.. కచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడన్నది కూడా ఓ న్యూస్.

  కొరటాలతో టైటిల్ ఇదే

  కొరటాలతో టైటిల్ ఇదే

  మరో ప్రక్క కొరటాల ప్రాజెక్టుకు టైటిల్ ఫైనల్ చేశారనే వార్తలు వస్తున్నాయి. 'భరత్ అను నేను' అనే టైటిల్ ని మహేష్ కోసం ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే.. కోర్టులో భగవద్గీతపై ప్రమాణం చేసేటపుడు చెప్పే మాట అని అర్ధమవుతోంది.

   నెలలో కొద్ది రోజులు

  నెలలో కొద్ది రోజులు

  కొరటాలకు మహేష్ కేటాయించిన డేట్స్ ను పరిశీలిస్తే.. మహేష్ లో చేంజ్ ఈజీగా అర్ధమవుతుంది. జనవరిలో 10 రోజులు.. ఫిబ్రవరిలో 15 రోజులు.. మార్చ్ లో 10 రోజులు చొప్పున.. డేట్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇలా ఇవ్వాల్సిందిగా కొరటాల అడిగి మరీ తీసుకోవడం అసలు విషయం.

   వీర క్రేజ్

  వీర క్రేజ్

  మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్ అంటే మహామహా క్రేజీ. ఒకే ఒక హిట్ ఉన్న డైరెక్టర్ తో.. ఇండస్ట్రీ టాప్ 2 హిట్ అయిన శ్రీమంతుడును ఇచ్చిన కాంబో ఇది. దాంతో ఈ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్ తో చేస్తున్న బై లింగ్యువల్ కంప్లీట్ కాగానే కొరటాలతో మహేష్ మూవీ ఇప్పటికే ఖాయం అయిపోయింది కూడా.

  English summary
  Mahesh Babu celebrated Diwali with his family members. Mahesh daughter Sitara was the center of attraction for this Diwali, she was enjoying Diwali by lighting crackers. While her brother Gautham was also present lighting crackers along with his friends. Hero Naresh family joined Mahesh family at the later’s residence . The house was decked up with lightings .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X