»   » ప్రకృతి స్వర్గంలో..... (మహేష్ బాబు ఫ్యామిలీ హాలీడే ఫోటోస్)

ప్రకృతి స్వర్గంలో..... (మహేష్ బాబు ఫ్యామిలీ హాలీడే ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక సినిమా పూర్తి అవగానే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫారన్ ట్రిప్ వెయ్యడం అలవాటు.'బ్రహ్మోత్సవం' సినిమా తరువాత మహేష్‌బాబు తన ఫ్యామిలీ తో కలసి యూకెలో గడపడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.

దాదాపు నెల రోజుల పాటు మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యామిలీ యూకెలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ట్రిప్పుకు సంబందించిన ఫోటోలు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

తమ హాలిడే టూర్ కు సంబంధించిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే కొన్ని విడుదలవ్వగా.....తాజాగా మరికొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. మహేష్ బాబు ఫ్యామిలీ పర్యటించిన లొకేషన్లు ఎంతో అందంగా ఉన్నాయి.

చూస్తుంటే ఇది ప్రకృతి స్వర్గంలా ఉండటం విశేషం. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరికీ.... తాము కూడా స్వర్గాన్ని తలపించే ప్రకృతి రమణీయత మధ్య గడపాలని కోరుకోవడం ఖాయం. అయితే ఈ ఫోటోల్లో మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ఫోటోలు తీసింది ఆయనే కాబట్టి.... ఇదే కాదు ఏ ఫ్యామిలీ ట్రిప్ లో అయినా మహేష్ బాబు ఫోటోలకూ దూరంగానే ఉంటారు. స్వయంగా తానే కెమెరా చేతబట్టి తన ముద్దుల పిల్లలను ఫోటో షూట్ చేస్తుంటారు.

పిల్లలతో నమ్రత

పిల్లలతో నమ్రత

తమ ఇద్దరు పిల్లలతో కలిసి నమ్రత శిరోద్కర్. బ్యాగ్రౌండ్లో లొకేషన్ చాలా అందంగా ఉంది కదూ.

బోటు షికారు

బోటు షికారు

ఈ ఫోటో చూస్తుంటే ఇదేదో బోటు షికారు లాగా ఉంది.

సెల్పీ..

సెల్పీ..

తన కుమారుడు గౌతంతో నమ్రత శిరోద్కర్ సెల్పీ...

ప్రకృతి స్వర్గం..

ప్రకృతి స్వర్గం..

ప్రకృతి స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో అనేలా ఉంది కూదూ ఈ లోకేషన్.

గౌతమ్, సితార

గౌతమ్, సితార

ప్రకృతి స్వర్గంలో గౌతమ్, సితార ఎంతో ఆనందంగా గడిపారు.

ఇలాంటి సరదాలు ఇక్కడ కుదరవు

ఇలాంటి సరదాలు ఇక్కడ కుదరవు

మహేష్ బాబు లాంటి సెలబ్రిటీ ఫ్యామిలీకి ఇండియాలో ఇలాంటి సరదాలు కుదరవు...అందుకే ఫారిన్ ట్రిప్.

గౌతమ్

గౌతమ్

యూకెలో తాము బస చేసిన హోటల్ వద్ద చెల్లితో కలిసి గౌతమ్.

ఇదే హోటల్

ఇదే హోటల్

మహేష్ బాబు ఫ్యామిలీ యూకెలో బస చేసిన హోటల్ ఇదే...

English summary
It is known that Mahesh Babu prefers to go on a holiday with his family, whenever he finds time; even if it is for a couple of days. Apparently, the Superstar has flown for a long holiday this time to UK, to make the most of his free time as well as to spend the kids' summer holidays, at a perfect destination.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu