»   »  లావెక్కిపోతారు: గచ్చిబౌలిలో మహేష్ బాబు వార్నింగ్ (ఫోటోస్)

లావెక్కిపోతారు: గచ్చిబౌలిలో మహేష్ బాబు వార్నింగ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గచ్చిబౌలిలో హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చక్ దే ఇండియా రైడ్' మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ సైకిల్ తొక్కడం చాలా మంచిది...లేకపోతే లావెక్కిపోతారని హెచ్చరించారు.

సైక్లింగ్‌ అనేది కేవలం కాలుష్యరహితమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంచుతుందని మహేష్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు జగపతిబాబు, దర్శకుడు కొరటాల శివ, సైక్లింగ్‌క్లబ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఆలిండియా బైసైక్లింగ్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10 కిలోమాటర్లు, 50 కిలోమీటర్లు రెండు విభాగాలుగా సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. 10 కిలోమీటర్ల రైడ్ లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువత తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈసందర్భంగా యువత పాడిన దేశభక్తి గీతాలు అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి.

మహేష్, జగపతి

మహేష్, జగపతి


జెండా ఊపి సైకిల్ రైడ్ ప్రారంభిస్తున్న మహేష్ బాబు, జగపతి బాబు.

మహేష్ బాబు

మహేష్ బాబు


ఫిట్ నెస్ ఆవశ్యకత గురించి మాట్లాడుతున్న మహేష్ బాబు.

శ్రీమంతుడు

శ్రీమంతుడు


శ్రీమంతుడు టీంకు పుష్పగుచ్చం అందజేస్తున్న నిర్వహికులు.

జగపతి బాబు

జగపతి బాబు


సైక్లింగ్‌ వల్ల వాతావారణం కాలుష్యరహితంగా మారుతుందని హీరో జగపతిబాబు అన్నారు. అందరికీ జగపతిబాబు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఔత్సాహికులు

ఔత్సాహికులు


బైసైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చక్ దే ఇండియా రైడ్'లో పాల్గొన్న ఔత్సాహికులు.

English summary
Mahesh Babu flags off Chak De India ride by Hyderabad Bicycling Club.
Please Wait while comments are loading...