సూపర్ స్టార్ శకం అలా మొదలైంది: మహేశ్‌కు శుభాకాంక్షలు చెప్పిన నమ్రత
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. సీనియర్ హీరో కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించాడు. ఆ తర్వాత 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని మహేశ్.. వరుస హిట్లతో సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక, ఈ మధ్య హ్యాట్రిక్ విజయాలను అందుకుని సత్తా చాటాడు. ఇలాంటి తరుణంలో మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 41 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.
మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన మొదటి చిత్రం 'నీడ'. ఇది విడుదలై ఆదివారంతో 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సూపర్ స్టార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో '41 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు శుభాకాంక్షలు. ఇలాంటి మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో చేరుకోవాలని ఆశిస్తున్నా. మహేశ్ శకానికి 41 ఏళ్లు' అని పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా, మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇందులో సూపర్ స్టార్ బ్యాంక్‌లను మోసం చేస్తున్న బడా బాబులపై పోరాటం చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థతో కలిసి ఈ సినిమాను మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











