»   » ‘భరత్ అనే నేను’ టీంకు ఐఫోన్లు గిఫ్టుగా ఇచ్చిన మహేష్ బాబు!

‘భరత్ అనే నేను’ టీంకు ఐఫోన్లు గిఫ్టుగా ఇచ్చిన మహేష్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భరత్ అనే నేను'. గతంలో ఏ సినిమాకు లేనంత కాన్ఫిడెన్స్‌తో ఉన్న మహేష్ ఈ చిత్ర బృందంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఐఫోన్ ఎక్స్ ఫోన్లు గిఫ్టుగా అందించారు. ఒక్కో ఫోన్ విలువ రూ. 80 వేలకు పైనే ఉంటుందని అంచనా.

మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా తన చేతుల మీదుగా ఈ బహుమతులను అందజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహుమతితో పాటు వారిని అప్రిషియేట్ చేస్తూ ఓ చిన్న లెటర్ కూడా గిఫ్టు ప్యాక్‌లో ఉంచారు.


Mahesh Babu gifts iPhone X mobiles for BAN team

కాగా, 'భరత్ అనే నేను' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు నటిస్తున్న తొలి పొలిటికల్ ఎంటర్టెనర్ ఇది. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.


రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహించారు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో 'భరత్ బహిరంగ సభ' పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు వేలాది మంది అభిమానులు హాజరై విజయవంతం చేశారు.


Mahesh Babu gifts iPhone X mobiles for BAN team

భరత్ బహిరంగ సభకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మరింత హైప్ వచ్చింది. సభ ముగిసిన అనంతరం ఎన్టీఆర్, రామ్ చరణ్, చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు మహేష్ దంపతులు.

English summary
Tollywood super star Mahesh Babu gives surprise gift of iPhone X mobiles for Bharat Ane Nenu cast and crew as a token of appreciation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X