»   » మహేష్ కోసం రంగం సిద్దం చేసుకొంటున్న డైరెక్టర్...!?

మహేష్ కోసం రంగం సిద్దం చేసుకొంటున్న డైరెక్టర్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగా 'నిదానమే ప్రధానం' అన్న సిద్ధాంతం ప్రకారం మెల్లిగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగే మహేష్ బాబు, ప్రస్తుతం 'దూకుడు' చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో వున్నాడు. దీని తర్వాత పూరీ జగన్నాథ్ తో 'బిజినెస్ మేన్' సినిమా చేస్తాడు. ఇదిలావుంచితే, మహేష్ బాబు చేయనున్న మరి కొన్ని ప్రాజక్టుల పేర్లు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.

వీటిలో 'రంగం' సినిమా దర్శకుడు కె.వి.ఆనంద్ తో ఒకటి..తమిళ దర్శకులు ఎక్కువగా టాలీవుడ్ మీద దృష్టి పెడుతుంటారు. ఎందుకంటే, ఇక్కడ ఒక హిట్ కొడితే చాలు, వెంటనే మన నిర్మాతల నుంచి కోట్లలో రేమ్యునేరేషన్ లాగేయచ్చన్నది వాళ్ల ఆశ. అందుకేనేమో, తమిళ దర్శకుడు కె.వి.ఆనంద్ కూడా ఇప్పుడు తెలుగు సినిమా మీద కన్నేశాడు. ఇటీవల తమిళంలో ఆనంద్ డైరెక్ట్ చేసిన 'కో' సినిమా రంగం పేరుతో తెలుగులో రిలీజై ఇక్కడ కూడా సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో అతని స్టయిల్ నచ్చి కొంతమంది తెలుగు హీరోలు అతనితో చేయడానికి ముందుకు వచ్చారు. మహేష్ బాబు కూడా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. దాంతో వీరి కాంబినేషన్ లో ఓ ప్రాజక్టుకి ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు.

కాగా రెండవది, 'సింహా' డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా. వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి ఓ ప్రముఖ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇది పక్కా మాస్ ఫిలిం గా రూపొందుతుందని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి, జూ ఎన్టీఆర్ తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే..!

English summary
Super star Mahesh babu, who is busy with the shooting of his upcoming film “Dookudu” under the direction of Srinu Vytla, have a movie titled ‘The Business Man’ under the direction of puri Jagannath after it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu