»   » మహేష్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు, తమ ఫ్యామిలీ హీరోకు సపోర్ట్ కోసం

మహేష్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు, తమ ఫ్యామిలీ హీరోకు సపోర్ట్ కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,పవన్ వంటి లాంటి స్టార్స్ ఆడియో పంక్షన్ లో మెరిస్తే వచ్చే క్రేజ్ వేరు. ఆ సినిమా గురించి మీడియా విస్తృతమైన ప్రచారం ఇస్తుంది. మహేష్ అభిమానులు అంతా సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియో లు షేర్ చేసి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తారు. సామాన్య ప్రేక్షకుల దృష్టి కూడా ఆ సినిమాపై పడుతుంది. ఇలాంటి ప్రచారం చిన్న సినిమాలకు చాలా అవసరం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


అయితే మహేష్ ప్రతీ సినిమాకు ఇలా ఆడియో పంక్షన్ కు చేస్తారా..నో చెయ్యనే చెయ్యరు. ఆయన ఆడియో పంక్షన్ కు రావాలంటే ఆయనకు ఉండే లెక్కలు ఆయనకు ఉంటాయి. తాజాగా ఆయన ఓ చిన్న చిత్రం ఆడియో పంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వివరాలు మీకు ఇక్కడ అందిస్తున్నాం.

Mahesh Babu - Nandini

ఈ చిత్రం హీరో నవీన్...సీనియర్ నటుడు నరేష్‌ తనయుడు, విజయ నిర్మలకు మనవడు. నవీన్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'నందిని నర్సింగ్‌ హోమ్‌'. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్ర ఆడియో వేడుక‌ను ఈ నెల 27 నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రానున్నాడ‌ని అఫీషియల్ గా చిత్ర నిర్మాతలు పోస్టర్స్ విడుదల చేసారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా...ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకొంటోంది.

నవీన్‌, నిత్య, శ్రావ్య నటీనటులుగా రూపొందుతోన్న చిత్రం 'నందిని నర్సింగ్‌ హోమ్‌'. ఎస్‌.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌పై తెరకెక్కుతోంది. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.... తమ ఫ్యామిలీ నుండి ఇండిస్టీకి పరిచయం అవుతున్న థర్డ్‌ జనరేషన్‌ హీరో నవీన్‌ అని తెలిపారు. ఈ నెల 27న ఆడియో జరుగుతుందని దానికి మహేష్‌ హాజరవుతారన్నారు.

సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ '' హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదంతో కూడుకున్న సినిమా. నవీన్‌ సత్యానంద్‌ మాస్టర్‌ దగ్గర ట్రయినింగ్‌ తీసుకున్నారు. మా ఫ్యామిలీ నుంచి మరో మంచి హీరోగా నవీన్‌ పేరు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను'' అని తెలిపారు.

హీరో నవీన్‌ మాట్లాడుతూ '' సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది'' అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : అచ్చు, ఎడిటింగ్‌ : కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, పాటలు : రెహమాన్‌, మాటలు : పి.వి.గిరి, సురేష్‌ ఆరపాటి, కొరియోగ్రఫీ : విజరు.

English summary
Mahesh Babu will be gracing as chief guest for 'Nandini Nursing Home' movie's audio launch event that is to be held on 27th September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu