»   » ఈ రోజే ఆడియో ఫంక్షన్...మహేష్ బాబే ఛీఫ్ గెస్ట్

ఈ రోజే ఆడియో ఫంక్షన్...మహేష్ బాబే ఛీఫ్ గెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని అఖిల్‌ హీరోగా వి.వి వినాయక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘అఖిల్‌'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు (సెప్టెంబర్ 20న) జరగనుంది. ఈ విషయమై అఖిల్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో విషయాన్ని ఖరారు చేసారు. అది మరేదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఆడియో పంక్షన్ కు విచ్చేస్తున్నారు. గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో ఈ ఆడియో పంక్షన్ భారీ ఎత్తున జరగనుంది.

 

akhil,mahesh

ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణకు మహేష్ రానుండడంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌పై ఆసక్తి రెట్టింపైంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఏ సినిమా ఆడియో రిలీజ్‌నూ చేపట్టనంత గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను చేపడుతున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాను నిర్మిస్తోన్న హీరో నితిన్ కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

audo poster

తాము ఆరు నెలలుగా పడ్డ కష్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అఖిల్‌ అన్నారు. అభిమానులను కలిసి తన అనుభవాలు పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తాతయ్యను చాలా మిస్‌ అవుతున్నామని, ఆయన ఎల్లపుడూ మనతోనే ఉంటారని అఖిల్‌ తన మనసులో మాటను పంచుకున్నారు

ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌, థమన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

మరిన్ని విశేషాలు

అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచయమవుతున్న 'అఖిల్‌' చిత్రం టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ టీజర్‌ను విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే ఈ టీజర్ 5 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ మేరకు నితిన్ చాలా ఆనందంగా ఉన్నాడు.

అలాగే ఈ టీజర్ కు అంతటా మంచి అప్లాజ్ వచ్చింది. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నితిన్‌ నిర్మిస్తున్నారు. ఈ టీజర్ ని ఇక్కడ చూడవచ్చు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/IUaAn9ABznM" frameborder="0" allowfullscreen></iframe>

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. మరో యువ హీరో నితిన్ తండ్రిసుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

AKIL

ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు ..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు.


యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
The audio launch of Akhil Akkineni's AKHIL is expected to be nothing short of amazing. Interesting update is that the makers invite Mahesh Babu to grace the event as the chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu