»   » మోడీ అడ్డా గుజరాత్ వెళుతున్న హీరో మహేష్ బాబు

మోడీ అడ్డా గుజరాత్ వెళుతున్న హీరో మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం ఎన్నికల వేళ గుజరాత్ అనగానే మనకు ముందుగా బీజేపీ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుర్తుకు వస్తారు. తెలుగు సినిమా స్టార్లయిన పవన్ కళ్యాణ్, నాగార్జున, జీవిత రాజశేఖర్ లాంటి వారు ఇప్పటికే మోడీని కలిసి తమ మద్దతు ప్రకటించారు.

తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గుజరాత్ వెళ్లబోతున్నారు. అయితే ఆయన వెళ్లేది మోడీని కలవడానికి మాత్రం కాదండోయ్. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ గుజరాత్‌లో ప్లాన్ చేసారు. ఈ మేరకు మహేష్ బాబుతో పాటు సినిమా యూనిట్ సభ్యులు గుజరాత్ వెళ్లబోతున్నారు.

Mahesh Babu to head to Gujarat

సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగ్ గుజరాత్‌లో జరిపనునప్నారు. కొన్ని వారాల పాటు యూనిట్ సభ్యులంతా ఇక్కడే గడపబోతున్నారు. యాక్షన్, కామెడీ, ప్యామిలీ డ్రామా కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేస్ బాబు సరసన తమన్నా హీరోయిన్. సోనూ సూద్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.

ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయి కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫ్ కెవి గుహన్ ఈచిత్రానికి పని చేస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Superstar Mahesh Babu’s latest flick Aagadu, is fast nearing completion. The principal shooting of this film has took up speed, and in this process will head to Gujarat now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu