»   » మహేష్ బాబుకు గాయం, ఆగడు షూటింగ్ ఆగింది?

మహేష్ బాబుకు గాయం, ఆగడు షూటింగ్ ఆగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు ప్రస్తుతం 'ఆగడు' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం బళ్లారి ప్రాంతంలో జరుగుతోంది. షూటింగు జరుగుతుండగా మహేష్ బాబు కాలుగుకు గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైద్యులు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ నిలిపి వేసినట్లు సమాచారం. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ స్క్రిప్టు అందించారు. మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో మహేష్ బాబు అక్క పాత్రలో కనిపించనుంది.

నదియా, మహేష్ బాబు కలిసి నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆగడు చిత్రంలోనూ ఆమె తనదైన ముద్ర వేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మళయాలం మూవీ దిృశ్యం తెలుగు రీమేక్‌లో కూడా ఆమె ఎంపికైంది.

ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబు, శ్రీనువైట, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ కాంబినేషన్లో 'దూకుడు' వంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆగడు చిత్రాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Film Nagar source said that, Mahesh Babu reportedly suffered heavy muscle cramps while shaking legs for a song in Bellary. He was immediately rushed to a local hospital and was suggested to take rest to recover. As a precautionary measure, the movie unit called off the film shooting and started to Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu