»   » అందరికీ గిఫ్టులు ఇవ్వబోతున్న మహేష్ బాబు!

అందరికీ గిఫ్టులు ఇవ్వబోతున్న మహేష్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 41 కోట్లు వసూలు చేసింది. తానే స్వయంగా నిర్మాతగా మారి, సొంత ప్రొడక్షన్ ద్వారా నిర్మించిన తొలి సినిమా మంచి విజయం సాధించడంపై మహేష్ బాబు చాలా ఆనందంగా ఉన్నారట.

సినిమా విజయంపై చాలా హ్యాపీగా ఉన్న మహేష్ బాబు శ్రీమంతుడు చిత్ర టీంకు ఏదైనా బహుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. గతంలో కొందరు తమిల హీరోలు, హీరోయిన్లు తమ సిబ్బందికి గోల్డ్ కాయిన్స్, వాచీలు బహుబతి ఇచ్చారు. ఇదే తరహాలు మహేష్ బాబు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని యోచిస్తున్నాడట.


Mahesh Babu is planning to reward Srimanthudu team

ఇప్పటి వరకు మహేష్ బాబు తన కుటుంబానికి చెందిన బ్యానర్లలో నటించాడు. అయితే అవి మహేష్ బాబు బ్రదర్ రమేష్ బాబు, సిస్టర్ మంజుల నిర్వహణలో ఉండేవి. అయితే తాజాగా మహేష్ బాబు స్వయంగా ‘జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్ష్ ప్రై.లి' పేరుతో కొత్త బేనర్ స్థాపించి ‘శ్రీమంతుడు' సినిమాతో తనే స్వయంగా నిర్మాత అవతారం ఎత్తారు.


శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సొంత ఊరుకు మంచి చేయాలనే కాన్సెప్టుతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

English summary
As his debut as a producer is super hit with Srimanthudu collected 41 crores in just first 3 days, Mahesh is planning to reward his team. However, he stated that whatever he will reward will not be given any publicity.
Please Wait while comments are loading...