»   » మహేష్ బాబే టాప్...దరిదాపుల్లో ఎవరూ లేరు (ఫోటో ఫీచర్)

మహేష్ బాబే టాప్...దరిదాపుల్లో ఎవరూ లేరు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన ఘనత దక్కించుకన్నారు. ప్రముఖ ఇండియన్ న్యూస్ నెట్వర్క్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో '2013 ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ మెన్' టాప్ 50లో మహేష్ బాబు మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆన్ లైన్ పోల్ ద్వారా ఈ ఎంపిక చేసారు. ఈ ఓటింగులో దాదాపు 7.34 లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు.

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, జాన్ అబ్రహంలతో పాటు క్రికెటర్లు విరాట్ కోహ్లి, ధోనీ, యువరాజ్ సింగ్....పొలిటీషియన్ రాహుల్ గాంధీ లాంటి వారు సైతం మహేస్ బాబు కంటే వెనక బడి పోవడం గమనార్మం. ఇక తెలుగు నుండి ఇతర స్టార్లలో రాణా దగ్గుబాటి 13వ స్థానంలో, రామ్ చరణ్ తేజ్ 23వ స్థానంలో నిలిచారు. ఇతర తెలుగు స్టార్లలలో ఎవరికీ టాప్ 50లో చోటు దక్కలేదు. తమిళ స్టార్ సూర్య 12వ స్థానంలో నిలిచాడు.

తనకు ఈ స్థానం దక్కడంపై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేసారు. అభిమానుల ఆశీర్వాదం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారిని సంతోషంగా ఉంచడాని సినిమాల విషయంలో చాలా కష్టపడుతున్నానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. తనకు సంబంధించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ తన భార్య నమ్రతే అని మహేష్ బాబు తెలిపారు. స్లైడ్ షోలో వివరాలు..

మహేష్ బాబు

మహేష్ బాబు

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో మొదటి స్థానం దక్కించుకున్నాడు.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో రెండో స్థానంలో నిలిచాడు.

ఫర్హాన్ అక్తర్

ఫర్హాన్ అక్తర్

ఫర్హాన్ అక్తర్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో మూడో స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో నాలుగో స్థానంలో నిలిచాడు.

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో ఐదో స్థానంలో నిలిచాడు.

సూర్య

సూర్య

తమిళ స్టార్ సూర్య టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో 12వ స్థానంలో నిలిచారు.

రాణా దగ్గుబాటి

రాణా దగ్గుబాటి

రాణా దగ్గుబాటి టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో 13 వ స్థానంలో నిలిచారు.

ధోనీ

ధోనీ

క్రికెటర్ ధోనీ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో 15 వస్థానంలో నిలిచారు

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో 19 వస్థానంలో నిలిచాడు.

రామ్ చరణ్ తేజ్

రామ్ చరణ్ తేజ్

రామ్ చరన్ తేజ్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో 23వ స్థానంలో నిలిచారు.

English summary
Mahesh Babu has been chosen as India’s Most Desirable Man for 2013 by readers in a poll conducted by Times of India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu