»   » మహేష్ బాబు వాహనం లాగుతూ ముద్దు‌గుమ్మలు (ఫోటోలు)

మహేష్ బాబు వాహనం లాగుతూ ముద్దు‌గుమ్మలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.

హీరోయిన్ క్రితి సానన్, ఇతర ముద్దుగుమ్మ మహేష్ బాబు వాహనాన్ని తాడుతో లాగుతూ ఉన్న స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో హీరోయిన్ క్రితి సానన్ తన హాట్ అందచందాలు, సెక్సీ ఒళ్లు విరుపులతో యూత్‌‍ను అట్రాక్ట్ చేసే విధంగా ఫోజులు ఇచ్చింది. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో....జనాల్ని థియేటర్ల వైపు ఆకర్షించడానికి పక్కా ప్రణాళికతో ఈ స్టిల్స్ విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు చూస్తూ...మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

షూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తి


తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘1-నేనొక్కడినే' చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో యూనిట్ సభ్యులు గుమ్మడికాయ కొట్టారు.

గౌతం తెరంగ్రేటం

గౌతం తెరంగ్రేటం


‘1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు.

సంక్రాంతి రిలీజ్

సంక్రాంతి రిలీజ్


ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.

ముఖ్య పాత్రలు

ముఖ్య పాత్రలు


సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు


మహేష్ బాబు సినిమా అంటేనే యూత్ లోనూ, ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ మహా క్రేజ్. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

నిర్మాతలు

నిర్మాతలు


14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu-Kriti Sanon's 1-nenokkadine movie stills released. Sukumar is directing the movie. 14 Reels Entertainment banner is producing the movie. The movie is all set to hit the screens on 10th January, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu