డిసెంబర్ 20:మహేష్ చేతుల మీదుగా పవర్ స్టార్ ఆడియో
బెంగళూరు : ఆంధ్రా సూపర్‌స్టార్ మహేష్‌బాబు కన్నడ సినిమా ఆడియో ఆవిష్కరణలో పాల్గొననున్నారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్, ఎరికా ఫెర్నాండెస్ జంటగా నటిస్తున్న నిన్నిందలే సినిమా ఆడియో ఆవిష్కరణను 20న నగరంలో నిర్వహించనున్నారు. మహేష్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రముఖ తెలుగు దర్శకుడు జయంత్ పరాంజె కన్నడలో తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మహేష్‌బాబు, జయంత్ పరాంజె అనుబంధంతోనే వేడుకలకు రానున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా నటిస్తుండడం మరో విశేషం. గత వారం నుంచి ఆయన పాల్గొన్న సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. కథకు అనుగుణంగా అధిక భాగం చిత్రీకరణను అమెరికాలో చిత్రీకరించారు. ఇటీవలే అమెరికా నుంచి యూనిట్ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు.
నగరంలో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు జయంత్ పరాంజె వెల్లడించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చౌడయ్య స్మారక సభాంగణం లేదా జ్ఞానజ్యోతి సభాంగణంలో నిర్వహించనున్నారు. ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. అవినాశ్, శృంగేరి, వినాయక్ జోషి, అలోక్‌బాబు, అవినాశ్, అచ్యుత్‌కుమార్, సాధుకోకిలా, రంగాయణ రఘు, ప్రతాప్, సిహికహి చంద్రు ప్రధాన తారాగణం. హొంబాళె ఫిలింస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











